Jagan 2.0 : జగన్ 1.0 విధ్వంసం ఇంకా మరిచిపోలేదు – లోకేష్ సెటైర్లు
Jagan 2.0 : ప్రజలు 1.0లో నువ్వు చేసిన అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు. నువ్వు చేసిన విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరావు
- By Sudheer Published Date - 08:45 PM, Wed - 5 February 25

ఈసారి జగన్ 2.0 (Jagan 2.0)ని చూడబోతున్నారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ‘ప్రజలు 1.0లో నువ్వు చేసిన అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు. నువ్వు చేసిన విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరావు. ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేశారు’ అని లోకేశ్ సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్(AP)లో ఎన్నికల్లో పరాజయం అనంతరం వైసీపీ (YCP) వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan) కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ నగరానికి చెందిన కార్పొరేటర్లు, పార్టీ నేతలతో భేటీ అయిన జగన్, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఇకపై జగన్ 2.0ను చూడబోతారని, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తన నాయకత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.
Delhi Exit Poll Results 2025 : ఎగ్జిట్ పోల్స్ పై ‘ఆప్’ అసంతృప్తి
ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇబ్బందులు పెడుతోందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుంటే, తాము కూడా చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. గత పాలనలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, అయితే పార్టీ కార్యకర్తల కోసం తగినంతగా పని చేయలేకపోయానని అంగీకరించారు. కానీ ఈసారి అలాంటి పొరపాట్లు జరగవని, కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టనున్నానని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన పార్టీ వైసీపీ మాత్రమేనని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను నిలిపేయకుండా, నిరంతరాయంగా ప్రజలకు అందించామని గొప్పలు చెప్పుకొచ్చారు. అక్కడి తో ఆగకుండా జగన్ 2.0 అనే కొత్త విధానంతో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పార్టీని మరింత శక్తివంతంగా మార్చి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవడమే లక్ష్యమని ప్రకటించారు.
Delhi Exit Poll Results 2025 : మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కమలానికే
ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగన్ 1.0 విధ్వంసం ప్రజలు మరిచిపోలేదు. ఇలాగే ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని ఎగిరావు. కానీ ప్రజలు నిన్ను గద్దె దించారు” అని వ్యాఖ్యానించారు. 2019 నుండి 2024 వరకు జగన్ 1.0 హయాంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోకేశ్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలివెళ్లారని, రోడ్ల నుండి విద్య, వైద్య రంగం వరకు అన్ని విభాగాల్లో సంక్షోభం వచ్చిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బిజెపి ప్రభుత్వ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారాయని , రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.
ప్రజలు 1.0 లో నువ్వు చేసిన అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, నువ్వు చేసిన విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరాడు, ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేసారు. #NaraLokeshInDelhi #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/xu3PVGq1Wi
— Telugu Desam Party (@JaiTDP) February 5, 2025