Nara Lokesh Holds Jr NTR Flexi : జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీతో సందడి చేసిన లోకేష్
NTR : ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి వారిలో ఉత్సాహాన్ని నింపారు
- Author : Sudheer
Date : 20-03-2025 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తాజాగా తన పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ (Jr NTR Flexi) ప్రదర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వెళ్లిన లోకేష్, తిరుగు ప్రయాణంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద టీడీపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
BJP Chief Post : బీజేపీ చీఫ్ రేసు.. ఆ నలుగురి మధ్యే ప్రధాన పోటీ
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు జూ.ఎన్టీఆర్ పేరును జపిస్తూ, కేరింతలు, ఈలలతో హర్షధ్వానాలు చేశారు. గత కొన్ని రోజులుగా టీడీపీ-జూ.ఎన్టీఆర్ మధ్య సంబంధాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ ఈ విధంగా ఫ్లెక్సీ ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అభిమానులు, రాజకీయ విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు!
ఈ ఘటనపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి అభిమానులు ఆయన పేరును ప్రస్తావించడం సహజమని, దీనికి ప్రత్యేక అర్థం లేదని వ్యాఖ్యానించాయి. అయితే ఇదే సందర్భంలో జూ.ఎన్టీఆర్ రాజకీయంగా టీడీపీకి దగ్గరవుతున్నారా? అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో సందడి చేయడం అందర్నీలో సంతోషం నింపింది.
#NaraLokesh proudly holds the #NTR hoarding@tarak9999 #NTR #NaraLokesh pic.twitter.com/XeQhUSJwTh
— Naveen_Tarak🥵 (@The_wild_Tiger9) March 19, 2025