Nara Lokesh : నారా లోకేష్ అనుకున్నాడంటే..జరగాల్సిందే..!!
Nara Lokesh : సమస్య ఏదైనా కానీ క్షణాల్లో ఆ సమస్యను తీర్చడం నారా లోకేష్ స్టయిల్. వేదిక ఏదైనా సరే అన్న మాకు ఈ కష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఆ కష్టం
- By Sudheer Published Date - 05:23 PM, Sat - 15 February 25

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఏదైనా అనుకున్నాడంటే అది జరిగే వరకు నిద్ర పోడు. సమస్య ఏదైనా కానీ క్షణాల్లో ఆ సమస్యను తీర్చడం నారా లోకేష్ స్టయిల్. వేదిక ఏదైనా సరే అన్న మాకు ఈ కష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఆ కష్టం నుండి వారిని బయటపడేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారం లేని సమయంలో కూడా ప్రజల సమస్యలను తీర్చి అందరివాడు అయ్యాడు. తాజాగా మరో గొప్ప సాయం చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
Food Subsidies: కేంద్రం సబ్సిడీలపై సంచలన నివేదిక.. హైరేంజులో ఆహార సబ్సిడీలు
గుంటూరు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, చెట్టూరి భార్గవ్ అనే ఇద్దరు విద్యార్థులు చదువు నిమిత్తం ఐర్లాండ్ వెళ్లారు. అయితే ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు ఇద్దరూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. ఈ ఘటనపై ఐర్లాండ్‌లోని తెలుగు సమాజం వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే ఐర్లాండ్‌లో తెలుగు ప్రజలు తక్కువగా ఉండటం, నిధుల సమీకరణ కష్టతరం కావడంతో ఈ విషయాన్ని నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలకు సహాయం చేయాల్సిందిగా ఆయనను కోరారు. వెంటనే స్పందించిన లోకేశ్ తన ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దించారు. అక్కడి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టింది.
ఇక సమస్యలు ఎంత వచ్చినా నారా లోకేశ్ వెనుకంజ వేయలేదు. అన్ని అవరోధాలను అధిగమించి మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. చివరికి శనివారం సురేశ్, భార్గవ్ మృతదేహాలు స్వస్థలాలకు చేరాయి. ఈ ఘటనలో నారా లోకేశ్ చొరవను తెలుగు సమాజం ప్రశంసిస్తోంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన లోకేశ్ సహాయాన్ని బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఐర్లాండ్ లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మృతి చెందిన చెరుకూరి సురేష్ మరియు చెట్టూరి భార్గవ్ వీరిరువురి మృతదేహాలను ఈ రోజు వారి స్వగ్రామాలకు తీసుకురావటం జరిగింది. #AndhraPradesh https://t.co/GQKNuKLjCd pic.twitter.com/ROIhZeZGnW
— Office of Nara Lokesh (@OfficeofNL) February 14, 2025