Lokesh Lunch Motion Petition: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్
స్కిల్ స్కాములో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అతనికి రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ సీఐడీ ఆరోపిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 01:06 PM, Fri - 29 September 23

Lokesh Lunch Motion Petition: స్కిల్ స్కాములో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అతనికి రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ సీఐడీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో విచారించిన అధికారులు 14 రోజులపాటు రిమాండ్ కోరుతూ పిటిషన్ వేశారు. విచారించిన సీఐడీ కోర్టు చంద్రబాబును రిమాండ్ కు తరలించింది. ఆ తర్వాత రిమాండ్ పొడిగిస్తూ వస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి పాల్పడ్డాడని నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సీఐడీ విచారణకు హాజరై సహకరించాలని సూచించింది. ఇదిలా ఉండగా కొద్దీ సేపటి క్రితం లోకేష్ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ తరఫు న్యాయవాదులు కొద్ది సేపటి క్రితం దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు రానున్నాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు ఉదయం డిస్పోజ్ చేసింది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 21 రోజులుగా జైల్లో వున్నారు.
Also Read: AP: లోకేష్ అరెస్ట్ అయితే ఎలా..? చంద్రబాబు ఏ సలహా ఇవ్వనున్నాడు..?