AP: లోకేష్ అరెస్ట్ అయితే ఎలా..? చంద్రబాబు ఏ సలహా ఇవ్వనున్నాడు..?
ఒకవేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ఎలా..? తర్వాత ఏం చేయాలి? ఎవరెవరు ఎలాంటి పనులు చేపట్టాలి అన్న దాని మీద కూడా బాబు తో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 29-09-2023 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి గత 20 రోజులుగా చంద్రబాబు (Chandrababu) రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన్ను బెయిల్ ఫై బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ (Nara Lokesh) తో పాటు టిడిపి నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇక ఈరోజు చంద్రబాబు తో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి (Nara Brahmani), మాజీ మంత్రి నారాయణ ములాకత్ అయ్యేందుకు కొద్దిసేపటి క్రితం ముగ్గురూ జైలు లోపలికి వెళ్ళారు.
ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు (Amaravati Inner Ring Road Ccam)లో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. దీంతో లోకేష్ యువగళం కూడా ఆగిపోనుంది. ఈ విషయాల గురించి బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ఎలా..? తర్వాత ఏం చేయాలి? ఎవరెవరు ఎలాంటి పనులు చేపట్టాలి అన్న దాని మీద కూడా బాబు తో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. బాబు చెప్పే సలహాలను బట్టి టిడిపి నేతలు ముందుకు వెళ్లనున్నారు. అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ పరిణామాల మీద కూడా బాబుతో బ్రహ్మణి చర్చించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజో మధ్యాహ్నం బాబు బెయిల్ ఫై హైకోర్టు లో తీర్పు రానుంది. ఇప్పటీకే వాదనలు ముగిసాయి. మరి బాబు కు బెయిల్ వస్తుందా..రాదా..? లోకేష్ ను అరెస్ట్ చేస్తారా..చేయరా..? అసలు ఏంజరగబోతుంది..? అనేది టిడిపి శ్రేణుల్లో టెన్షన్ పెట్టిస్తుంది.
Read Also : RGV : ఆమె అందం నుండి వర్మ బయటకు రాలేకపోతున్నాడు..