Nara Lokesh : యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది.. బాబు బెయిల్ పై లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్
- Author : Prasad
Date : 31-10-2023 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.నాలుగు వారాల పాటు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బాబు బెయిల్ పై టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు లోకేష్ కూడా చంద్రబాబు బెయిల్ పై స్పందించారు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ లోకేష్ టీడీపీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. రేపటి నుంచి అసలు యుద్ధం మొదలవులతుందంటూ లోకేష్ కామెంట్ చేశారు. చంద్రబాబు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నారా లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి లో యువగళం క్యాంప్‌సైట్‌కి లోకేష్ రావడంతో నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుని తీసుకురానున్నారు. నేరుగా రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు రానున్నారు. ఉండవల్లి నివాసానికి వచ్చిన తరువాత మరుసటి రోజు చంద్రబాబు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు.
Also Read: Chandrababu Bail : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్