Nara Lokesh Birthday : యువనేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
- By Sudheer Published Date - 11:22 AM, Tue - 23 January 24

నారా లోకేష్ (Nara Lokesh ) తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తనయుడుగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే టిడిపి వ్యవస్థాపకులు దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు (NTR) మనవడిగా లోకేష్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. తాత, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ ప్రవేశం చేశారు నారా లోకేష్. మొదట వ్యాపార రంగాలలో అడుగుపెట్టి రాణించిన లోకేష్.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈరోజు నారా లోకేష్ 41 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ముందుగా ఆయనకు ‘Hashtagu‘ టీం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
1983 జనవరి 23న చంద్రబాబు -భువనేశ్వర్ల దంపతులకు నారా లోకేష్ జన్మించారు. లోకేష్ జన్మించేనాటికి చంద్రబాబు ఎమ్మెల్యే గా , మంత్రిగా ప్రజలకు సేవ చేసారు. లోకేష్ ప్రాధమిక విద్య అంత కూడా హైదరాబాద్ లోనే జరిగింది. ఆ తర్వాత స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసాడు. చిన్నప్పటి నుండి కూడా లోకేష్ చదువుల్లో ఎంతో ప్రావిణ్యం చూపించేవారు. లోకేష్ స్కూల్ కు వెళ్లే టైంలోనే తన తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండడం తో అత్యంత భద్రత నడుమ స్కూల్ కు వెళ్ళేది. క్రమశిక్షణ లోను లోకేష్ తండ్రికితగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికా లో ఉన్నత చదువులు చదివిన నారా లోకేష్..ఇండియా కు వచ్చి వారి వ్యాపార సంస్థ అయినా Heritage కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యత చేపట్టారు. లోకేష్ MD గా ఉన్న సమయంలో ఈ సంస్థ పలు ప్రాంతాలలో కొత్త స్టార్ లను ఏర్పాటు జరిగింది. వ్యాపార విస్తరణ కూడా వేగంగా జరిగింది. అలాగే పలు విభాగాల్లో కూడా Heritage పలు అవార్డ్స్ అందుకోవడం లో లోకేష్ కీలక పాత్ర పోషించాడు.
లోకేష్ – సంక్షేమ కార్యక్రమాలు :
లోకేష్ రాజకీయ ప్రవేశం చేయకముందు నుండే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ తన ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ఓ మెంబర్ గా ఉన్న లోకేష్ ..విద్య , ఆరోగ్యం రంగాలలో విశేష సేవలు అందించారు. ఎంతోమంది పేదలకు ఉచిత విద్యాబ్యాసం అందించడం తో పాటు ఆరోగ్య సదుపాయాలు కల్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి లోకేష్ రూపకల్పన చేసారు. ఆరోగ్యం ఫై శ్రద్ద తీసుకోవడం తో పాటు ఆరోగ్యానికి సంబదించిన ఇతర సేవలకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామీణ , పట్టణ ప్రజలకు చేరువై కార్యక్రమం ఇది. దీని ద్వారా బ్లడ్ క్యాంపులు , హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అనేక సేవలు అందించారు. అంతే కాక విపత్తుల సమయంలో లోకేష్ సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. తూఫాన్ , వరదల వల్ల నష్టపోయిన వారికీ సాయం అందించడంలో లోకేష్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం అందించారు.
రాజకీయ ప్రవేశం – పదవులు :
నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి మే 2013లో చేరి, తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. పార్టీలోకి చేరకముందే పార్టీ కి తన సలహాలు , సూచనలు ఇస్తూ ఉండేవారు. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకము ఆలోచన లోకేష్ చేసేదే అని చంద్రబాబు పలుమార్లు చెప్పడం జరిగింది. పార్టీలో చేరిన దగ్గరి నుండి లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసారు. లక్షల మంది కార్యకర్తలకు విద్య , వైద్య సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం లోకేష్ ఎంతగానో పనిచేసారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ పార్టీ విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఏపీ శాసన మండలికి ఎన్నికయ్యాడు. అనంతరం తండ్రి కాబినెట్ లో కీలక పదవి చేపట్టారు. పంచాయితీ , గ్రామానిభివృద్ది , ఐటీ వంటి కీలక శాఖలను లోకేష్ చేపట్టి ఆయా శాఖల్లో రాష్ట్రం అభివృద్ధి సాదించడంలో లోకేష్ తన వంతు కృషి చేసారు.
అమరావతిలో ఐటీ కంపెనీ ల ఏర్పాటు కోసం లోకేష్ ఎంతగానో కృషి చేసారు. అలాగే పంచాయితీ , అభివృద్ధి విభాగాల్లో కేంద్రం రాష్ట్రానికి పలు అవార్డ్స్ ఇచ్చింది. వీటి వెనుక ఆయా శాఖల మంత్రిగా లోకేష్ తన పాత్ర పోషించారు.
వివాదాలు :
తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్న..తనచుట్టూ అనేక వివాదాలు అల్లుకున్నాయి. వైసీపీ నుండి పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి..అనేక అవినీతి ఆరోపణలు చేసారు.
లోకేష్ వివాహం :
నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ని 2007 లో వివాహం చేసుకున్నాడు. వీరికి దేవాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్ , చంద్రబాబు రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో బ్రాహ్మణి Heritage వ్యాపారాలను చూసుకుంటుంది.
లోకేష్ యువగళం :
ఒక నాయకుడు రాజకీయాల్లో రాణించాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ముఖ్యంగా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆటుపోట్లను తట్టుకొని నిలబడేవారే పరిపూర్ణ నేతగా రాటుదేలుతారు. ఇలాంటి అవకాశం తక్కువ మందికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో యువగళం పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి అలాంటి సువర్ణావకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని లోకేశ్ సద్వినియోగం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.
పాదయాత్రకు ఆదిలోనే చిత్తూరు జిల్లాలో పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ, మైక్‌సెట్లను తొలగించినా, లోకేశ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఎన్ని ఇబ్బందులొచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పి పట్టువిడకుండా పాదయాత్రను కొనసాగించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు తర్వాత పార్టీలో పట్టు సాధించడం..ఈ రెండు లక్ష్యాలతో లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర అయినా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అయినా ప్రతి రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యం అధికారమే! కానీ లోకేష్ పాదయాత్ర అధికార దాహంతో చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. ప్రజల ఇబ్బందులు, అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకోవడానికే అన్నట్లు సాగింది. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత, నెలల తరబడి జీతాలు అందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఫించన్ అందని వృద్ధులు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ఇలా అనేకమంది పాదయాత్రలో తమ గోడు చెప్పుకున్నారు. వీరందరికీ భరోసానిస్తూ, ఆ అనుభవాల ఆధారంగా తమ మేనిఫెస్టోని, ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు లోకేష్.
చంద్రబాబు అరెస్ట్ :
స్కిల్ డెవలప్ కేసు లో చంద్రబాబు ను అరెస్ట్ చేయడం లోకేష్ ను కాస్త ఆందోళనకు గురి చేసింది. పాదయాత్ర చేస్తున్న క్రమంలో తన తండ్రిని అరెస్ట్ చేసారని తెలిసి..పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చి..తన తండ్రిని ఈ అక్రమ కేసు నుండి బయటకు వచ్చేలా చేయడం లో లోకేష్ ఎంతో కష్టపడ్డారు. ఇది తప్పుడు కేసు అని ఆధారాలు ఉన్నప్పటికి..అధికార పార్టీ..బాబు ఫై మరిన్నో కేసులు పెడుతూ కనీసం బెయిల్ కూడా రాకుండా చేసింది. అయినప్పటికీ ఎక్కడ డౌన్ కాకుండా ఢిల్లీ లో ఉంటూ అక్కడి సీనియర్ లాయర్లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ..చివరకు తన తండ్రికి బెయిల్ తెప్పించి ఆయన బయటకు వచ్చేలా చేసారు. ఆ సమయంలో లోకేష్ పడిన కష్టం అందర్నీ ఎంతో బాధకు గురి చేసింది.
ప్రస్తుతం..లోకేష్ ఫోకస్ అంత త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్ర ప్రజల్లో సంతోషం నింపాలని చూస్తున్నాడు. అందుకు గాను జనసేన తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది లోకేష్ కు మరింత కలిసి రావాలని Hashtagu టీం కోరుకుంటూ ఆయనకు మరోసారి బర్త్ డే విషెష్ అందిస్తుంది.
Read Also : Maruti Suzuki Brezza: మార్కెట్లోకి మళ్లీ బ్రెజా మైల్డ్ హైబ్రిడ్ వర్షన్లు.. ధరెంతో తెలుసా..?