Fastest Checkmate Solver : నారా దేవాన్ష్‌కు అరుదైన అవార్డ్
Fastest Checkmate Solver : దేవాన్ష్ చెస్‌లో ఇదే మొదటి విజయమేమీ కాదు. ఇప్పటికే అతడు మరో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టవర్ ఆఫ్ హనాయ్ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పరిష్కరించి వేగవంతమైన సాల్వర్‌గా రికార్డు నెలకొల్పాడు
- By Sudheer Published Date - 06:38 PM, Sun - 14 September 25

లండన్‌లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 అవార్డు కార్యక్రమంలో నారా దేవాన్ష్ (Nara Devaansh ) ప్రత్యేక అవార్డును అందుకున్నారు. ‘వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ (fastest checkmate solver) విభాగంలో సాధించిన అసాధారణ విజయానికి ఈ గౌరవం లభించింది. 2024 డిసెంబర్ 18న హైదరాబాద్‌లో నిర్వహించిన చెక్ మేట్ మారథాన్ లో దేవాన్ష్ కేవలం 11 నిమిషాలు 59 సెకన్లలో 175 చెక్ మేట్ పజిల్స్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Bakasura Restaurant : ‘బకాసుర రెస్టారెంట్’ అస్సలు వదిలిపెట్టకండి !!
ఈ విశేష ప్రతిభను గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ సంస్థ అధికారికంగా ధృవీకరించి సర్టిఫికెట్‌ను అందించింది. వేగం, ఏకాగ్రత, ధైర్యం కలిపి చూపిన దేవాన్ష్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. వెస్ట్‌మినిస్టర్ హాల్ అనే ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డు, సర్టిఫికేట్, ట్రోఫీలు అందుకోవడం దేవాన్ష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. కేవలం 9 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో విజయాలు సాధించడం అతడి ప్రతిభను మరింత విశిష్టంగా నిలిపింది.
దేవాన్ష్ చెస్‌లో ఇదే మొదటి విజయమేమీ కాదు. ఇప్పటికే అతడు మరో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టవర్ ఆఫ్ హనాయ్ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పరిష్కరించి వేగవంతమైన సాల్వర్‌గా రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా వేగవంతమైన చెస్ బోర్డ్ అరేంజర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఈ విజయాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్విట్టర్‌లో అభినందనలు తెలుపుతూ, దేవాన్ష్ ప్రతిభపై గర్వం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై వెలుగొందిన దేవాన్ష్ భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సృష్టించే అవకాశముందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.