Nandyal TDP Candidate : పెను ప్రమాదం నుండి బయటపడ్డ నంద్యాల టీడీపీ అభ్యర్థి
కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది
- By Sudheer Published Date - 08:37 PM, Tue - 9 April 24

నంద్యాల టీడీపీ అభ్యర్థి (Nandyal TDP Candidate) ఎన్‌ఎమ్‌డి ఫరూక్(NMD Farooq)కు పెను ప్రమాదం (Accident) నుండి క్షేమంగా బయటపడ్డారు. నంద్యాల నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది. ఈ క్రమంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫరూక్ కు స్వల్ప గాయాలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రమాదంలో కారు (Car Accident)ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఫరూక్ ను నంద్యాలలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఫరూక్ అనుచరులు అంటున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫరూక్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వస్తున్నారు.
Read Also : Keerti Suresh : 40 రోజుల వనవాసం పూర్తి చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ పోస్ట్ పై ఆడియన్స్ షాక్..!