Nagababu : పెద్దిరెడ్డి బాగోతాలు బయటపెట్టిన మెగా బ్రదర్
Nagababu : పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని , అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:44 PM, Sun - 2 February 25

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)పై జనసేన నేత నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదివారం చిత్తూరు జిల్లాలోని సోమల దగ్గర జనసేన ఇవాళ(ఆదివారం) భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో నాగబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పై విరుచుకపడ్డారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని , అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని, అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబు జోస్యం చెప్పారు.
Rishi Sunak : బ్యాటింగ్‌లో అదరగొడుతున్న మాజీ ప్రధానమంత్రి
ఇక, వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. “నోటికొచ్చినట్టు వాగే వైసీపీ సన్నాసులకు చెబుతున్నా… వృద్ధులు, వితంతువుల పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇస్తున్నాం. పెంచిన పెన్షన్లను ప్రతి నెల వాళ్ల ఇళ్ల వద్దేనే ఇస్తున్నాం. దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్లు ఇస్తున్నాం. గత జగన్ ప్రభుత్వం వచ్చిన మొదటి నాలుగు నెలల్లో రూ.250 పెన్షన్ పెంచడం తప్ప వేరే ఏ హామీ అమలు మొదలుపెట్టలేదు” అని నాగబాబు విమర్శించారు.
రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు తెచ్చుకున్నామని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.12 వేల కోట్ల నిధులు సంపాదించుకున్నామని వివరించారు. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని నాగబాబు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లకు రూ.361 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.