Pawan Kalyan : జగన్ చేసిన పాపాన్ని కళ్యాణ్ కడిగేస్తున్నాడు – నాగబాబు
Pawan Kalyan : 'జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు'
- By Sudheer Published Date - 08:42 PM, Tue - 24 September 24

Pawan Kalyan Cleaning Vijayawada Kanaka Durga Temple Steps : తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేసి, మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంపై ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు (Nagababu) ట్వీట్ చేశారు. ‘జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు’ అని పేర్కొన్నారు.
ఇక తిరుమల లడ్డు వివాదం కూటమి vs వైసీపీ గా మారింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే..మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని వైసీపీ అంటుంది. అంతే కాదు దేవుడి ముందు ప్రమాణాలు సైతం చేస్తున్నారు. రోజు రోజుకు ఈ వివాదం తారాస్థాయికి చేరుతుంది. తాజాగా అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని, తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని తెలిపారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని అంబటి రాంబాబు విమర్శించారు.
టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. ‘తండ్రి చనిపోతే తలనీలాలు ఇవ్వని చంద్రబాబు (Chandrababu) హిందూధర్మం గురించి మాట్లాడటం దారుణం అని , పెద్ద ఆరోపణ చేసి దానిని నిరూపించలేకపోతున్నారని రాంబాబు అన్నారు. టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ (Pawan Kalyan) బూట్లు తుడుస్తాం. ఆయనెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్లే కదా చేయాలి’ అని అన్నారు.
Read Also : Youtuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయి పై పోలీసులకు పిర్యాదు చేసిన యువతీ