సలాం.. పోలీస్ : 150 వలస కూలీల ఆకలి తీర్చిన మైలవరం పోలీసులు!
పోలీసుల అంటే లాఠీ పట్టుకొని శాంతిభద్రతలను పరిరక్షించడమే కాదు.. అవసరమైతే గొప్ప సేవ కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడితే మానవతవాదులుగా మారి సాయం చేస్తారు.
- Author : Balu J
Date : 23-11-2021 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
ఒడిశా రాష్ట్రం నుండి పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకు తమిళనాడు రాష్ట్రం వెళుతూ మార్గ మధ్యలో నిన్న కృష్ణ జిల్లా, మైలవరం వద్దకు వచ్చేసరికి, ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ బస్ గేర్ బాక్స్ సమస్య వచ్చింది. దీంతో బస్ ఆగిపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న 150 మంది చిన్న పిల్లలు, వృద్దులు, మహిళా కూలీలు ఆకలితో అలమటించారు. అందులో చిన్న పిల్లలు, మహిళలు వరకు దాదాపు 150 మంది కూలీలు ఉన్నారు. వలస కూలీలను చూసి పోలీసులు చలించిపోయారు.
దాతల సహకారంతో వారికి భోజనాలు సమకూర్చి, వారి ఆకలి భాద తీర్చారు. అర్థరాత్రి సమయంలో కూలీలు ప్రయాణిస్తున్న బస్ ని రిపేర్ చేయించి, కూలీలు ప్రయాణానికి మార్గం సుగమం చేశారు. అర్థరాత్రి ఊరు కానీ ఊరులో, భాష కానీ భాష కలిగిన ప్రాంతంలో మానవత్వంతో స్పందించి భోజనానికి డబ్బు లేని దయనీయ స్థితిలో ఉన్న 150 మంది పిల్లలు, పెద్దలకు ఆపన్న హస్తం అందించిన మైలవరం పోలీసులకు ఒడిశా కూలీలు నమస్కరించారు.