HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Model Of Education Akshara Sarathi Lokesh

Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది

  • Author : Sudheer Date : 01-05-2026 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే విద్యను రాజకీయాలకు దూరం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో విద్యావ్యవస్థపై పడిన రాజకీయ రంగులను తొలగిస్తూ, పాఠశాల గేటు లోపలికి రాజకీయాలకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టించారు. ప్రభుత్వ పథకాలకు తన సొంత ఫోటోలు లేదా పార్టీ రంగులు వాడకుండా, మహనీయులైన డొక్కా సీతమ్మ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేడ్కర్ మరియు అబ్దుల్ కలాం వంటి వారి పేర్లు పెట్టడం ఆయన నిజాయితీకి నిదర్శనం. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులు మరియు క్రీడా పరికరాలపై కూడా ఎటువంటి రాజకీయ ప్రచార చిత్రాలు ఉండకూడదని కచ్చితమైన ఆదేశాలిచ్చి అమలు చేస్తున్నారు.

Ap 10th

Ap 10th

పారదర్శకతకు పట్టం

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాన్ని లోకేష్ వినూత్నంగా చాటిచెప్పారు. భారత దేశ విద్యా చరిత్రలోనే తొలిసారిగా, ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ప్రతిభ చాటిన విద్యార్థుల ఫోటోలు, వారు సాధించిన మార్కులు మరియు స్కూళ్ల వివరాలతో పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం ‘నెంబర్ వన్’ అని డబ్బా కొట్టుకోకుండా, విద్యార్థుల శ్రమను గౌరవిస్తూ వారిని సమాజం ముందు హీరోలుగా నిలబెట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభను చాటిచెప్పిన ఈ ప్రకటన ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.

‘ఏపీ మోడల్’ దిశగా పయనం

కార్పొరేట్ పాఠశాలల వ్యాపార ధోరణికి భిన్నంగా, ప్రభుత్వ పాఠశాలల్లో “అమ్మలా శిక్షణ – నాన్నలా రక్షణ” అనే నినాదంతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయుల బోధన, స్నేహపూర్వక వాతావరణం ప్రభుత్వ బడుల బలం అని చాటిచెబుతూ, తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా పిలుపునిచ్చారు. తప్పులను ఒప్పుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ పారదర్శకతతో ఆయన సాగిస్తున్న ఈ ‘మిషన్’ ఫలితంగానే ఇంటర్ మరియు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యాలయాలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ దిశగా అడుగులు పడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • APDevelopment
  • APEducation
  • APModelOfEducation
  • EducationReforms
  • GovtSchools
  • LokeshForEducation
  • naralokesh
  • NewEraInEducation
  • QualityEducation
  • TeluguNews

Related News

Electricity Charges HIKE IN AP

Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. పమిడిముక్కల వేదికగా జరిగిన

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Lv Prasad Eye Hospital

    LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

  • Techie Suicide

    Illegal Affair : కలచివేస్తున్న టెక్కీ సూసైడ్ నోట్.. ‘ఆమె కోరుకునేది శృంగారమేనా?’

  • Ap 10th Exam Results

    AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!

Latest News

  • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

  • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

  • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

  • లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd