HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mla Roja Get Berth In The Jagan Cabinet

Jagan Cabinet: రోజాకు హోంమంత్రి ఖాయ‌మా..?

  • Author : HashtagU Desk Date : 19-03-2022 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mla Roja Jagan Cabinet
Mla Roja Jagan Cabinet

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో కొంద‌రికి మాత్ర‌మే కొత్త మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని, దీంతో మంత్రి పదవులు కోల్పోయిన వారిని పార్టీ పదవుల్లో నియమిస్తానని ఇటీవ‌ల కేబినెట్ మీటింగ్‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమకు మంత్రిపదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఇక జ‌గ‌న్ న‌యా కేబినెట్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయో ఈపాటికే లిస్టు ప్రిపేర్ అయిపోయిందనీ, ముఖ్య మంత్రి వద్దనే ఆ లిస్టు వుందనీ, దాదాపుగా ఆయా ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం తెలుసనీ అంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు యూట్యూబ్ చాన‌ళ్ళు, వైబ్‌సైట్లు, సోష‌ల్ మీడియాల‌లో అయితే ప‌లానా ఎమ్మెల్యేకి మంత్రివ‌ర్గంలో చోటు ఖాయ‌మ‌ని, వైసీపీ వ‌ర్గీయులు లీక్ చేసిన కొత్త‌ మంత్రివ‌ర్గ‌ జాబితా ఇదే అంటూ రోజుకో లిస్ట్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

దీంతో లీక్ అయిన కొత్త మంత్రివ‌ర్గ లిస్ట్ పై సోష‌ల్ మీడియాలో చోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక లీక్ అయిన లిస్ట్‌లో ఎమ్మెల్యే రోజా పేరు ఉండ‌టం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే జ‌గ‌న్ కేబినెట్‌లో, రోజాకు చోటు ద‌క్కింద‌ని, ముఖ్యమైన విష‌యం ఏంటంటే జ‌గ‌న్ ఆమెకు హోంశాఖ కేటాయించారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ హోంశాఖ ఇవ్వ‌కుంటే కేబినెట్‌లో రోజా బెర్త్ మాత్రం గ్యారెంటీ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే స్వయంగా సీఎం జగనే ఆమెకు హామీ ఇచ్చారని రోజా వ‌ర్గీయులు ప్రచారం చేస్తున్నారు.

ఇక‌ రోజా ఇటీవ‌ల గుళ్లు గోపురాల‌కు ఎక్కువ‌గా తిరుగుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. దీంతో ఆమెకు పదవి ఖరారు అయినందుకే రోజా ఇలా మొక్కులు తీర్చుకుంటూ గుళ్లు గోపురాలకు తిరుగుతున్నారని కొందరు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి రోజాకు తొలిసారే మంత్ర వ‌ర్గంలో చోటు ద‌క్కాల్సి ఉంది. అప్ప‌ట్లో జ‌గ‌న్ కేబినెట్‌లో రోజాకు హోంశాఖ ఇస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఏమైందో ఏమో గానీ రోజాకు మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌లేదు. దీంతో రోజాను బుజ్జ‌గించేందుకు ఓ నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చినా, ఆ త‌ర్వాత అది కూడా పీకేశారు. అయితే ఇప్పుడు మ‌రోసారి మంత్రి కేట‌గిరీలో రోజా పేరు వినిపిస్తుంది.ఇది నిజ‌మో కాదో తెలియ‌దు కానీ రోజా హోంమంత్రి అయితే టీడీపీ బ్యాచ్‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీవర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Home Minister
  • jagan cabinet
  • mla roja
  • ys jagan
  • ysrcp

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

  • Polavaram Project

    జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd