MLA Sreedhar Reddy : లోకేష్ ను సర్పంచ్ కాదు కదా.. వార్డు మెంబర్ గా కూడా గుర్తించలే – వైసీపీ ఎమ్మెల్యే
- Author : Sudheer
Date : 11-02-2024 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తూ ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు టిడిపి , జనసేన, కాంగ్రెస్ పార్టీలలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ లో చేరుతున్నట్లు ప్రచారం అవుతుండగా వాటిని కొట్టేసారు.
పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) త్వరలో టిడిపి లో చేరబోతున్నట్లు..ఇప్పటికే లోకేష్ ను కలిసినట్లు జరుగుతున్నా ప్రచారాన్ని ఆయన ఖండించారు. ‘నేను లోకేశ్ ను కలిసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఒక నాయకుడిగా, సర్పంచ్, వార్డు మెంబర్గా నేను గుర్తించలేదు. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఒక సర్పంచ్, కౌన్సిలర్ గా కూడా గెలవలేదు. దొడ్డిదారిలో వచ్చి ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు కలుస్తాను.. జీవితకాలం జగనన్న వెంటే ఉంటా..అందులో ఎలాంటి సందేహం లేదని శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ప్రశాంతతకు మారుపేరులా ఉండే పుట్టపర్తి(Puttaparthi) ఇప్పుడు రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ వైసీపీ(YCP) లో వర్గ పోరు.. ఆస్తులు, విగ్రహాలు ధ్వంసం చేసే వరకు చేరుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి(MLA Sreedhar Reddy) కి టికెట్ ఇవ్వకూడదని నల్లమాడలో నిర్వహించిన సమావేశానికి నాయకత్వం వహించిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి(Locherla Vijay Bhaskar Reddy) లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.
శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Sri Satya Sai Super Specialty Hospital) సమీపంలో ఏర్పాటు చేసిన లోచర్ల పెద్దారెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే ధ్వంసం చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. రాజకీయంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకించినప్పటి నుంచి నన్ను ఏదో ఒక విధంగా మానసికంగా దెబ్బ కొట్టాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడని విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తిలో ఎన్నడూ లేని వీసా సంస్కృతికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాంది పలకారని, ఇటువంటి దాడులు ఆస్తుల ధ్వంసం ఘటనలతో ప్రజలకు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు