MLA Chanti babu Meets Pawan : పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ సీటును కోరిన వైసీపీ ఎమ్మెల్యే..
- Author : Sudheer
Date : 30-12-2023 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ (AP)లో ఎన్నికల సమయం (Elections) దగ్గర పడుతుండడంతో వలసల పర్వం ఊపందుకుంటుంది. వైసీపీ పార్టీ (YCP) నుండి పెద్ద ఎత్తున బయటకు వచ్చేందుకు నేతలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటీకే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..జనవరి రెండో వారం నాటికీ చాలామంది బయటకు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. రీసెంట్ గా వైజాగ్ ఎమ్మెల్సీ వంశీ..జనసేన లో చేరగా..తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (MLA Chanti babu)..పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
పవన్ కల్యాణ్ పిలిస్తేనే వెళ్లినట్లు చంటిబాబు చెప్పుకొచ్చారు. ఇక ఈ సమావేశంలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అలాగే పవన్ ముందు కీలక ప్రతిపాదన పెట్టాడట ఎమ్మెల్యే చంటిబాబు.. కాకినాడ (Kakinada MP) ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ ను కోరినట్లు తెలుస్తుంది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట.. దీంతో ఆలోచనలో పడిపోయిన జనసేనాని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చంటి చెప్పుకొచ్చారు. మరి కాకినాడ ఎంపీ సీటు ఇస్తారో లేదో చూడాలి.
Read Also : Governor Tamilisai : రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ