Bhanu Prakash Gali : ‘ఇక్కడ ఉన్నది రోజా కాదు…భాను’ అంటూ అధికారులకు వార్నింగ్
ప్రభుత్వం మారిందని, అలవాట్లు కూడా మారాలని నిజాయితీగా, బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు
- By Sudheer Published Date - 11:20 PM, Thu - 27 June 24

ఏపీలో ఏర్పడిన కూటమి..అధికారుల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. గత ప్రభుత్వం ఏంచెప్పిన చేస్తూ..అవినీతికి కొమ్ముకాస్తూ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసేందుకు సహాయపడిన వారిపై బదిలీవేటు వేస్తూ..అధికారుల పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తుంది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమావేశం అవుతూ ఐదేళ్ల లో సాగిన పనుల ఫై ఆరా తీస్తూ సమీక్షాలు జరుపుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు సైతం ఆయా నియోజకవర్గం అధికారాలు తీరు విషయంలో అసహనం వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకోవాలని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నగరి ఎమ్మెల్యే భాను (MLA Bhanu Prakash Gali ) కూడా అలాంటి వార్నింగ్ లే ఇచ్చారు. ‘ఇక్కడ ఉన్నది రోజా కాదు…భాను’ అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. పుత్తూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిందని, అలవాట్లు కూడా మారాలని నిజాయితీగా, బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, శాంతి భద్రతలు కాపాడాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నారు. అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచికి మంచి, చెడుకు చెడు, నాటకాలు ఆడితే సహించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గంజాయి, సారాయి, ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసేవారిని వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Read Also : Kalki First Day Collections : ఓవర్సీస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రభాస్..