Dokka Seethamma Mid Day Meal : “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్
Dokka Seethamma Mid Day Meal : "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు
- By Sudheer Published Date - 01:12 PM, Sat - 4 January 25

శనివారం విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు. ముందుగా కళాశాల తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్‌ను పరిశీలించిన మంత్రి, విద్యార్థినిలతో కాసేపు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం సహాయపడుతుందని , మాదక ద్రవ్యాల వ్యసనాలను దూరం పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే ప్రభుత్వాన్ని వెంటనే అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. మీ అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
Maha Kumbh Mela 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయకుండా మహా కుంభమేళాలో పాల్గొంటున్న స్వామీజీ
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పథకం అమలుకు ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 85.84 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసింది. కాగా ప్రజాగళంలో నారా లోకేష్ విద్యార్థులు ఈ పథకం అమలు చేయాలనీ తెలుపగా.. విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న నారా లోకేశ్ ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేశారు. అధికారంలోకి రాగానే పథకానికి జీవో జారీ చేసి అమలు జరిపారు. విద్యార్థుల విద్యా ప్రగతికి ఇది దోహదపడుతుందని నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.