Ashok Leyland Plant : అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి లోకేశ్
Ashok Leyland Plant : ఈ ప్లాంట్ ద్వారా పరిశ్రమల అభివృద్ధి మాత్రమే కాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు
- By Sudheer Published Date - 09:23 PM, Wed - 19 March 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కు(Mallavalli Industrial Park)లో అశోక్ లేలాండ్ ప్లాంట్(Ashok Leyland Plant)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన ప్రాంగణంలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తమ కృషిని సూచించారు. ఈ ప్లాంట్ ద్వారా పరిశ్రమల అభివృద్ధి మాత్రమే కాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.
Congress 6 Guarantees : 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ – కిషన్ రెడ్డి
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభంతో మొదటి దశలో 600 మందికి, రెండో దశలో 1,200 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమ రాష్ట్రంలోని వాహన తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుందని అన్నారు.
మల్లవల్లిలో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో బీఎస్-4 మోడల్ బస్సుల తయారీతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల బాడీ బిల్డింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహానికి ఒక నిదర్శనమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లోకేశ్ వెల్లడించారు.