HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Kodali Nani Cornered In Ycrp

Kodali Nani : వైసీపీలో ఒంటరైన మంత్రి కొడాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఎవరైనా పల్లెత్తు మాటంటే చాలు... వెంటనే వారిపై విరుచుకుపడిపోయే బ్యాచ్ లో అందరికంటే ముందుండేది మాత్రం మంత్రి కొడాలి నానినే.

  • Author : Hashtag U Date : 26-01-2022 - 5:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఎవరైనా పల్లెత్తు మాటంటే చాలు… వెంటనే వారిపై విరుచుకుపడిపోయే బ్యాచ్ లో అందరికంటే ముందుండేది మాత్రం మంత్రి కొడాలి నానినే. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే… చంద్రబాబు మరియు టీడీపీ నేతలపై బండ బూతులు తిడుతూ ఉండే వ్యక్తి లేదా మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే… ఆయన కొడాలి మాత్రమే. ఈ మధ్య కొడాలి నాని ఉపయోగించే భాష, ఆయన వ్యవహారశైలి, హావాభావాలు మరీ శృతి మించిపోతున్నట్లు ఉన్నాయని వైసీపీ లోని కొందరు నేతలే గుసగుసలాడుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఇటీవల సంక్రాతికి క్యాసినోలు అంటూ చెలరేగిన వివాదంలో కొడాలి పై వచ్చిన విమర్శల విషయంలో… ఆయనకి అండగా పార్టీ నుంచి సపోర్ట్ చేయడానికి వచ్చినవాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఈ వ్యవహారంలో కనీసం వైసీపీ నుంచి ఖండించినట్లు ఒక్క ప్రకటన అయినా వెలువడిందా అంటే… లేదనే సమాధానమే వినిపిస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే…

సంక్రాంతి పండుగకి గుడివాడలో క్యాసినోలు పెట్టారు, గోవా కల్చర్ తెచ్చారు అనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఉన్న వ్యక్తులు, బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న పాటలు, పైన వైసీపీ రంగులతో కట్టిన పరదాలు.. ఇవన్నీ కొడాలి నానిని టార్గెట్ చేసేలా ఉన్నాయి.లీడర్ పేరు చెప్పుకుని అభిమానులు ఏదైనా ఆవేశ పడితే… దానికి ఆ నాయకుడిని బాధ్యుడిని అయితే చేయలేము. కాకపోతే… ఈ వ్యవహారంలో కొడాలి నాని కూడా ఇలాగే ఇరుక్కుపోయారని చెప్పవచ్చు. దీంతో విపక్ష పార్టీల నేతలు దొరికిందే సందని రెచ్చిపోయాయి. అసలు సంక్రాంతి రోజు, క్యాసినో జరిగింది అని చెబుతున్న రోజు తాను గుడివాడలోనే లేనని… ఆస్పత్రిలో ఉన్నానని కొడాలి నాని మొత్తుకుంటున్నా కూడా ఎవరూ వినని పరిస్థితి నెలకొంది.అసలు కృష్ణా జిల్లా గుడివాడలో చీమ చిటుక్కుమన్నా కూడా… అది కొడాలిదే బాధ్యత అంటూ తెలుగు దేశం పార్టీ ఏకంగా నిజ నిర్థారణ కమిటీ పేరుతో రాద్ధాంతం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది కూడా. ప్రధాన ప్రతిపక్ష పార్టీవి కుయుక్తులు అని కొట్టిపారేసినా.. ఇప్పుడు వారికి అవకాశం దొరికింది కాబట్టి, గుడివాడ ఇష్యూని వారు అంత తేలిగ్గా వదిలిపెడతారని అనుకోలేం. మరి దానికి కౌంటర్ గా వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందనేదే ఇక్కడ అసలు ప్రశ్నగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసిన నాని ఒక్కరే ఉన్నారు.. ఆయనే కొడాలి నాని అంటూ.. ఆమధ్య సినీ హీరో నానిపై సెటైర్లు పేల్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా.. క్యాసినో విషయం వచ్చేసరికి కొడాలి నానికి మద్దతుగా మాట్లాడలేదు. అంతెందుకు మంత్రుల్లో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మినహా… ఇంకెవరూ కూడా కొడాలికి మద్దతుగా కనీసం ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్దం చేసుకోవచ్చు. చంద్రబాబు పేరు ఎత్తితే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయే కొడాలి నాని విషయంలో మిగిలిన మంత్రులు కావచ్చు లేదా పార్టీలోని ఇతర ముఖ్య నేతలు కావచ్చు… వారంతా కూడా తమకెందుకులే అని సైలెంట్ అయిపోయారా..? లేదంటే… హైకమాండ్ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయా..? అనేది వారికే తెలియాలి.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోని ఏ మంత్రిపై కూడా ఇంత తీవ్రమైన అరోపణలు రాలేదనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా అవి ఈ స్థాయిలో లేవు. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను అడ్డుపెట్టుకుని వైరి వర్గమైన తెలుగుదేశం పార్టీ మాత్రం ఓ ఆట ఆడుకుంటోందనే చెప్పాలి. పైగా కొడాలి నాని కూడా సహనం కోల్పోయి, టీడీపీ నేతల పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన నేతలే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొడాలి నాని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, ఆయన ముద్దుల తనయుడు లోకేష్ పై గతంలో తిట్టిన తిట్లకంటే…. ఎక్కువగానే ఉతికి ఆరేస్తున్నారు.

అయినా కూడా ఇలాంటి సమయంలో కొడాలికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నుంచి ఎందుకు సపోర్ట్ దొరకడం లేదనేదే ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఇంకా చెప్పాలంటే… పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అంటే గిట్టని వాళ్లే అధికార పార్టీలో ఎక్కువ మంది ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలన్నిటినీ గమనిస్తే… జగన్ మీద ఈగని కూడా వాలనీయకుండే చూసుకునే కొడాలి…. తనదాక వచ్చేసరికి మాత్రం ఒంటరిగా మిగిలారని పార్టీలోని మరోవర్గం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా ఈ కొడాలి… క్యాసినో… గోవా కల్చర్ అన్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడికి వెళుతుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • minister kodali nani
  • ys jagan
  • YSRCP MLA

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd