HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Jogi Ramesh Fires On Pawan Kalyan

Minister Jogi Ramesh : జ‌న‌సేనానికి మంత్రి జోగి ర‌మేష్ వార్నింగ్‌.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రి జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. పొత్తుల‌పై ఆయ‌న మాట్లాడుతూ పిచ్చోడికి మ‌ళ్లీ పెళ్లి

  • Author : Prasad Date : 17-09-2023 - 6:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jogi Ramesh

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రి జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. పొత్తుల‌పై ఆయ‌న మాట్లాడుతూ పిచ్చోడికి మ‌ళ్లీ పెళ్లి కుదిరింద‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తో ములాఖత్ కు వెళ్ళి మిలాఖత్ అయ్యాక పవన్ కు లగ్గం కుదిరిందన్నారు. 5 కోట్ల మంది ప్రజల్ని అడిగితె జగన్ స్థాయి పవన్ కు చెప్తారని.. ముందు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో చెప్పాలన్నారు. సింగిల్ హ్యాండ్ తో పార్టీ స్థాపించి ,చరిత్ర సృష్టించేలా జ‌గ‌న్ విజ‌యం సాధించార‌ని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. యువరాజ్యాన్ని కాంగ్రెస్ కు అమ్మేసిన పవన్ కళ్యణ్ స్థాయి ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. జనసేనను చంద్రబాబుకు అమ్మేసిన ప్యాకేజి స్టార్ కు స్థాయి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాజ‌కీయాల్లో విలువలు ,సిద్ధాంతం ,ఆశయాలే పవన్ కళ్యాణ్ కు లేవ‌ని.. చంద్రబాబుని ,లోకేష్ ని ఒకప్పుడు తిట్టి ఇప్పడూ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని కార్యకర్తలు పిచ్చివాళ్లవుతున్నార‌న్నారు.

సీఎం జ‌గ‌న్ గురించి మాట్లాడేట‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి కూతలు కూస్తే బట్టలు ఇప్పతిసి కొడతామంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నోరు అదుపు తప్పి మాట్లాడితే ప్రజలే పవన్ కు గుణపాఠం చెప్తారని.. పొత్తు పెట్టుకున్న, పాలేరుగా ఉన్న మాకు సంబంధం లేదని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మానసిక స్థితి బాగోలేదని.. ఆ విష‌యం పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకుని వదిలేసినా వారికీ తెలుసన్నారు. నామరూపాలు లేకుండా చేస్తా అన్న చంద్రబాబు జైలు ఊసలు లెక్కపెడుతున్నార‌ని.. స్కిల్ స్కాం లో లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని ఆయ‌న ఆరోపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Minister Jogi ramesh
  • chandrababu-pawan Kalyan
  • Janasena
  • JSP TDP
  • tdp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd