HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Anagani Satya Prasad Fires On Ysrcp

TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Author : Prasad Date : 01-06-2026 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.మంగ‌ళ‌గిరి కేంద్ర‌కార్యాల‌యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,, విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్యకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జంబులయ్య భార్యకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ) ఉద్యోగం కల్పించారని, ఆ నియామకానికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సిఫారసు చేశారని మంత్రి వెల్లడించారు. జంబులయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తాము వైసీపీ కార్యకర్తలమని చెప్పిన వీడియో వాంగ్మూలాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. వైఎస్ విగ్రహం తల భాగాన్ని ధ్వంసం చేయించి, దానికి తెలుగుదేశం పార్టీని బాధ్యులుగా చూపించే ప్రయత్నం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఘటన వెనుక ఉన్న వాస్తవాలు బయటపడటంతో వైసీపీ ఇబ్బందుల్లో పడిందన్నారు. మనుషుల ప్రాణాలు తీసిన చరిత్ర ఉన్న వారికి విగ్రహాల తలలు ధ్వంసం చేయడం పెద్ద విషయం కాదని.. విగ్రహాన్ని ధ్వంసం చేయించడం, ఆ తర్వాత అదే అంశంపై ధర్నాలు చేయడం వైసీపీ రాజకీయ సంస్కృతికి నిదర్శన‌మ‌న్నారు. శవం, సింపతీ, స్టాట్యూ రాజకీయాలు చేయడం వైసీపీ విధాన‌మ‌ని.. వైఎస్ మరణానంతరం రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారని అన‌గాని ఆరోపించారు. ఇప్పుడు అదే విగ్రహాల ధ్వంసాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

వైసీపీకి చెందిన కీలక నేతల అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి ఘటనలను ఉపయోగించుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ముఖ్యంగా జగన్ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఆస్తులు, బినామీ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తరహా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తుండటం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటం వైసీపీకి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు. డీఎస్సీ నియామకాలు విజయవంతంగా పూర్తవడం, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, వాటిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమ‌ని.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, అనిశ్చితి సృష్టించడం వైసీపీ రాజకీయ విధానమ‌న్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అసత్య ప్రచారాలు, కుట్రలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anagani Sathya Prasad
  • tdp
  • ysrcp

Related News

AP CM Chandrababu

CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్త

  • AP TDP

    AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd