Pithapuram : పిఠాపురంలో భారీగా పోలింగ్..
ఉదయం పోలింగ్ ప్రారంభ సమయానికే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. యువత..మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు
- By Sudheer Published Date - 11:33 AM, Mon - 13 May 24

ఏపీ మొత్తం పోలింగ్ ఒకెత్తు..పిఠాపురం(Pithapuram )లో ఒకెత్తు. దీనికి కారణం చెప్పాల్సిన పనిలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిల్చున్నాడనే వార్త బయటకు వచ్చిన దగ్గరి నుండే పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మారుమోగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ఈరోజు వరకు కూడా వార్తల్లో పిఠాపురం నిలుస్తూ వస్తుంది. పిఠాపురం అంటే తెలియని వారు దీని గురించి తెలుసుకునే పనిలోపడ్డారు. గత నెల రోజులుగా పిఠాపురం ఓ పాపులర్ సిటీ గా మారిపోయింది. ప్రతి రోజు సినీ ప్రముఖులతో కళాకలాడుతూ వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు కూడా అదే విధంగా ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభ సమయానికే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. యువత..మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. తొలి రెండు గంటల్లో దాదాపుగా పది శాతం పోలింగ్ నమోదైంది.పోలింగ్ పూర్తియే సమయానికి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటె, అక్కడ వైసీపీ అభ్యర్థిని వంగా గీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పిఠాపురంలో RRBHR స్కూల్ 144 బూత్‌లో ఆమె ఓటు వేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు మంగళగిరి లో ఉండడం తో అక్కడ తన సతీమణి తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Also : PM in 2025: మరో రెండు నెలల్లో ప్రధానిగా అమిత్ షా: కేజ్రీవాల్