Minister Lokesh – Manchu Manoj : మంత్రి లోకేశ్ తో మంచు మనోజ్ భేటీ
Minister Lokesh - Manchu Manoj : ఈ భేటీ నేపథ్యంలో మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి
- By Sudheer Published Date - 05:32 PM, Wed - 15 January 25

నారావారిపల్లి(naravaripalle)లో మంత్రి నారా లోకేష్(Nara Lokesh)తో ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి భేటీ అయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడంతో పాటు, మనోజ్ తన సమస్యలపై లోకేష్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నారావారిపల్లె నుంచి మోహన్ బాబు కాలేజీ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదం పెద్ద రచ్చగా మారింది. మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే తొలగించడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KTR : కేటీఆర్ కు మరోసారి నోటీసులు..?
మరోవైపు, మోహన్ బాబు కాలేజీ ప్రాంగణంలోకి మంచు మనోజ్ ప్రవేశించరాదని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ కాలేజీకి వెళ్ళినప్పుడు పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కాలేజీ గేట్ల వద్ద జరిగిన ఈ పరిణామాన్ని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ, కెమెరామెన్‌లతో వీడియో తీయించారు. మనోజ్‌తో పాటు ఆయన భార్య మౌనిక కూడా ఈ ఘటనా స్థలంలో ఉన్నారు. కోర్టు ఉత్తర్వులు, పోలీసుల నోటీసుల కారణంగా కాలేజీలోకి వెళ్లకుండానే మనోజ్ అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్లారు. మోహన్ బాబు కాలేజీకి చెందిన వివాదంపై కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్‌ను మోహన్ బాబు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, మనోజ్ కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కాలేజీ వద్దకు చేరుకున్న మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలు మంచు కుటుంబంలో వున్న విభేదాలను మరింత వెలుగులోకి తీసుకొచ్చాయి.