Gudlavalleru Engineering College : సెలవులు ప్రకటించిన యాజమాన్యం
విద్యార్థి సంఘాల ఆందోళనలతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండడంతో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది
- By Sudheer Published Date - 07:32 PM, Fri - 30 August 24

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ (SR Gudlavalleru Engineering College) లో అమ్మాయిల హాస్టల్ (Girls Hostel) బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు (Secret Camera in Bathroom) ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన ఫై ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన కు పాల్పడిన వారిపై కఠిన శిక్ష విధించాలని విద్యార్థి సంఘాలు , తల్లిదండ్రులు , విద్యార్థులు డిమాండ్ చేస్తూ..అర్ధరాత్రి నుండి ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండడంతో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. శని, ఆదివారం హాస్టల్ విద్యార్థులకు సైతం సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థినులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి సమ్మె చేయాలని విద్యార్థులు భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్‌రూమ్‌లలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు , వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని స్టూడెంట్స్ అంటున్నారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసినా యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలను ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. ఇక 300 పైగా వీడియోలను చిత్రీకరించారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంత మంది ఫైనలియర్ బిటెక్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా విద్యార్థినులు చెపుతున్నారు. ఈ ఘటన ఫై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
Read Also :Study : ఊబకాయం 3 మరణాలలో 2 గుండె జబ్బులతో ముడిపడి ఉన్నాయి