AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది… పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
- By Kode Mohan Sai Published Date - 12:56 PM, Fri - 22 November 24

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం | #ApDeputyCm #PawanKalyan #BotsaSatyanarayana #APBudgetSession2024 #HashtagU pic.twitter.com/D8n0S0b6s0
— Hashtag U (@HashtaguIn) November 22, 2024
అసెంబ్లీ వెలుపల పవన్ కారెక్కేందుకు వస్తుండగా, వైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఇతర ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో, బొత్స సత్యనారాయణ పవన్ ఎదుట నిలబడి నమస్కారం పెట్టారు. ఆయన స్పందన చూసిన పవన్, బొత్సకు ఎదురెళ్లారు. దీంతో, బొత్స సత్యనారాయణ పవన్‌ను మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, పవన్ బొత్స భుజంపై తట్టి, కరచాలనం చేసి మర్యాదతో వెళ్లిపోయారు.