Mahesh Babu Opinion on Ysr : వైఎస్సార్, జగన్ అద్భుతమైన వ్యక్తులు..మహేశ్ బాబు వీడియోను షేర్ చేసిన మంత్రి రోజా..!!
ప్రిన్స్ మహేశ్ బాబు ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషేస్ తెలియజేస్తున్నారు.
- Author : hashtagu
Date : 09-08-2022 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రిన్స్ మహేశ్ బాబు ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషేస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఏపీ సాంస్కృతిక, పర్యాటక, యువజనాభివృద్ధి మంత్రి రోజా కూడా మహేశ్ బాబుకు బర్త్ డే విషేస్ చెప్పారు. ఈ సందర్భంగా మహేశ్ తో ఇంటర్వ్యూ చేసిన ఓ వీడియోను షేర్ చేశారు రోజా.
గతంలో సాక్షి ఛానెల్ కోసం రోజా మహేశ్ బాబును ఇంటర్వ్యూ చేశారు. అప్పటి ఈ వీడియోలో వైఎస్సార్ పై మీ అభిప్రాయం ఏంటి..? అని రోజా అడిగారు. దానికి మహేశ్ బాబు సమాధానమిస్తూ…రాజకీయాలను పక్కన పెట్టినట్లయితే..వైఎస్సార్ తాను వ్యక్తిగతంగా కలిశాను. మా నాన్న కృష్ణకు వైఎస్సార్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. నేను వైఎస్సార్ ను కలిసిన సమయంలో జగన్ కూడా ఉన్నారు. నిజాయితీగా చెప్పాలంటే వాళ్లు అద్భుతమైన వ్యక్తులు. అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.
రాజన్నపై సూపర్ స్టార్ మహేశ్ మనసులో మాట.. #YSR #HBDSuperstarMahesh #MaheshBabu𓃵 #MaheshBabuBirthday pic.twitter.com/5NcbkBFdDG
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 9, 2022