Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన ప్రకటన..బరిలోనుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం
- By Sudheer Published Date - 02:05 PM, Sat - 2 March 24

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంత మంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు.
We’re now on WhatsApp. Click to Join.
రాజేష్ పేరు ప్రకటించగానే సోషల్ మీడియా లో గతంలో వైసీపీ లో రాజేష్ ఉన్న క్రమంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై చేసిన కామెంట్స్ ను తెరపైకి తీసుకొచ్చి ఆయన్ను ఇబ్బంది పెట్టె ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ వీడియోస్ చూసిన చాలామంది టీడీపీ , జనసేన కార్య కర్తలు రాజేష్ టికెట్ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం అని రాజేష్ చెప్పుకొచ్చారు. గతంలో చేసిన కామెంట్స్ ను వారు ఇప్పుడు బయటకు తీసి నాకు టికెట్ లేకుండా చేయాలనీ , ఓ మీడియా చేస్తుందని రాజేష్ వాపోయాడు. మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని.. కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు.. కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి ప్రజలకు చెప్పడానికే ఆయన వీడియో చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. మహాసేన రాజేష్ ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు అని చెపుతున్నారు.
Read Also : Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య