Lokesh : పవన్ అన్న జోలికి వస్తే వదిలిపెట్టం – జగన్ కు లోకేష్ వార్నింగ్
Pawan : పవన్ అన్న జోలికి వస్తే వదిలిపెట్టం - జగన్ కు లోకేష్ వార్నింగ్
- By Sudheer Published Date - 05:00 AM, Thu - 6 March 25

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan)పై చేసిన వ్యాఖ్యలు అధికార పక్ష నేతలకు ఆగ్రహం తెప్పించాయి. జగన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన మంత్రి నారా లోకేష్ (Lokesh), ఆయన మాటలకు కౌంటర్ ఇస్తూ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం జగన్‌ను భయపెట్టిందని, అందుకే ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Kamal Haasan : మోడీ ప్రభుత్వం పై కమల్ హాసన్ కీలక ఆరోపణలు
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ నాయకత్వానికి ప్రజలు విశేష మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ఆయనను విమర్శించడం జగన్ తప్పుడు రాజకీయం చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, జగన్ హయాంలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని , జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉండిన జగన్, ఇప్పుడు అసెంబ్లీకి కూడా రాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు 2024 ఎన్నికల్లో జగన్ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారంటే, ఆయన పాలనపై ప్రజలు ఏ స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారో అర్థమవుతుందన్నారు.