Warm & Wonderful : లోకేష్ ఒక్క ట్వీట్ తో వార్ తగ్గించాడు
Warm & Wonderful : వీరిద్దరి ట్వీట్స్ ...ప్రేమాభిమానాలు వారిమధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పకనే చెప్పాయి
- Author : Sudheer
Date : 24-01-2025 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొద్దీ రోజులుగా ఏపీలో డిప్యూటీ సీఎం (Deputy CM ) అంశం కాకరేపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ (Nara Lokesh) ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలనీ పలువురు టీడీపీ నేతలు డిమాండ్..ఇదే తరుణంలో జనసేన నేతలు , శ్రేణులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను సీఎం చేయాలనీ డిమాండ్ , ఇలా ఇరు పార్టీల శ్రేణుల డిమాండ్స్ తో కూటమి లో ఏంజరగబోతుందో అనే టెన్షన్ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. రోజు రోజుకు ఈ వార్ ఎక్కువ అవుతుండడంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఎవ్వరు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనీ మాట్లాడడం కానీ , మీడియా ముందు డిమాండ్ చేయడం కానీ చేయకూడదని..ఏంచేయాలో కూటమి అలోచించి చేస్తుంది తప్ప ఎవ్వరు కూడా ఈ అంశం గురించి మాట్లాడవద్దని హెచ్చరించింది. ఈ హెచ్చరికతో అంత సైలెంట్ అయ్యారు.
Narendra Modi : ఆడపిల్లలల విన్యాసాలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయి
ఇక ఇప్పుడు లోకేష్ కూడా పార్టీ శ్రేణులకు ఈ అంశం ఫై ఎవ్వరు మాట్లాడొద్దంటూ చెప్పకనే చెప్పాడు. నిన్న జనవరి 23 లోకేష్ బర్త్ డే. ఈ సందర్బంగా ఆయనకు రాజకీయ పార్టీల నేతలు, ఇతర రంగాల వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. వీరిలో డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. పవన్ తన అధికారిక ఖాతా ద్వారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి, సోదరసమానులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ తెలిపారు. పవన్ శుభాకాంక్షలకు లోకేశ్ వెంటనే స్పందించి తన కృతజ్ఞతలు తెలుపుతూ “Warm and Wonderful” అని అభివర్ణించారు. వీరిద్దరి ట్వీట్స్ …ప్రేమాభిమానాలు వారిమధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పకనే చెప్పాయి. ఇది చాలు కూటమి ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి. ఇప్పటికైనా ఇరు పార్టీల శ్రేణులు తమ డిమాండ్ ను పక్కకు పెట్టాలని అంత కోరుకుంటున్నారు.