Nara Lokesh : మంగళగిరి కోసం ఎవరు చేయలేని పనిని లోకేష్ చేస్తున్నాడు
Nara Lokesh : విద్యార్థిగా ఉన్నప్పుడు తన వద్ద దాచుకున్న కోటి రూపాయల్ని (Crore Rupees) నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
- By Sudheer Published Date - 08:11 PM, Sun - 13 April 25

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి(Mangalagiri Constituency Development)కి తాను ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తన వద్ద దాచుకున్న కోటి రూపాయల్ని (Crore Rupees) నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి పట్ల తనలో ఉన్న సంకల్పమే ఆ పని చేయించింది అని పేర్కొన్నారు. తాజాగా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన లోకేష్, అదే సందర్భంగా మన ఇల్లు–మన లోకేష్ కార్యక్రమం ద్వారా పలు మంది పేదలకు భూముల పట్టాలు కూడా అందించారు.
Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి ప్రజలు తనపై చూపించిన ప్రేమ మరువలేనిదని లోకేష్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించానని, చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. రహదారుల విస్తరణ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉంచుకుంటూ వారి అవసరాలను గుర్తించి, తగిన సాయాన్ని అందించడంలో లోకేష్ సానుకూలంగా ముందుండటం విశేషం. గత 15 రోజుల వ్యవధిలోనే మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 3 వేల మందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చామని లోకేష్ పేర్కొన్నారు. ఈ భూముల విలువ సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అయినా ఆ భూములపై ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీగా తీసుకోకుండా ఉచితంగా భూములు రిజిస్టర్ చేయించినట్టు వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలనే లక్ష్యాన్ని చేపట్టామని, ఇది టీడీపీ అధినేత చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని అన్నారు.