Lokesh Counter : లోకేశ్ కౌంటర్ ఆ మంత్రికేనా?
Lokesh Counter : గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌పై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారి తీశాయి
- By Sudheer Published Date - 03:16 PM, Thu - 16 October 25

గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌పై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారి తీశాయి. ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు సుమారు ₹22వేల కోట్ల విలువైన పన్ను మరియు భూమి రాయితీలు ఇచ్చిందని, ఆ రాయితీల కారణంగానే సంస్థ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని అన్నారు. “ఇలాంటి రాయితీలు మేము కర్ణాటకలో ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని కొందరు విమర్శిస్తారు. కానీ ఇతర రాష్ట్రాలు ఇస్తే అభివృద్ధి అన్న ముసుగులో ప్రశంసలు అందుకుంటున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?
ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, పెద్ద కంపెనీల పెట్టుబడులు చూసి కొందరికి అసూయ కలుగుతోంది. మా రాష్ట్రం పెట్టుబడులకు హబ్‌గా మారడం సహజమే. ఇక్కడ స్పష్టమైన పాలన, స్థిరమైన విధానాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలే కారణం. ఆంధ్రా పెట్టుబడులు సెగ పొరుగువారికి తగులుతున్నాయి” అని ట్వీట్ చేశారు. లోకేశ్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుత పరిస్థితిలో రెండు రాష్ట్రాల మధ్య ఐటీ రంగంలో పెట్టుబడుల పోటీ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ఐటీ రంగానికి చరిత్రాత్మక కేంద్రంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఇటీవల మౌలిక వసతుల మెరుగుదల, పారదర్శక విధానాల కారణంగా కొత్త కంపెనీలను ఆకర్షిస్తోంది. గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, ఆంధ్రా టెక్ ఎకానమీని మరో స్థాయికి తీసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ అభివృద్ధి రాజకీయ వాదనలకూ కేంద్రబిందువవుతున్నది. ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుండగా, మరోవైపు ఆర్థిక విధానాలపై విమర్శలూ, ప్రతివిమర్శలూ ఉధృతమవుతున్నాయి.