Mega PTM 2.0 : మరోసారి శభాష్ అనిపించుకున్న లోకేష్ ..ఏంచేసాడో తెలుసా..?
Mega PTM 2.0 : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తండ్రి-కొడుకులు అందరినీ ఆకట్టుకున్నారు
- By Sudheer Published Date - 09:32 PM, Thu - 10 July 25

సత్య సాయి జిల్లా కొత్తచెరువు ZP హైస్కూల్‌లో నిర్వహించిన “మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0” (Mega PTM 2.0) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తండ్రి-కొడుకులు అందరినీ ఆకట్టుకున్నారు. భోజనం అనంతరం లోకేష్ తన ప్లేట్‌తో పాటు తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను కూడా స్వయంగా తీసుకెళ్లడం ఎంతో మందికి హర్షానందాన్ని కలిగించింది. ఒక మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా తండ్రికి సేవచేసి తన గౌరవాన్ని చూపిన లోకేష్‌ను పలువురు అభినందిస్తున్నారు.
AP Liquor Case : విజయసాయికి మరోసారి సిట్ నోటీసులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చంద్రబాబు, లోకేష్ ముందుగా స్కూల్ పర్యటన చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, స్కూల్ వసతుల గురించి తెలుసుకున్నారు. సీఎం పిల్లలతో పాఠాలు చెప్పగా, లోకేష్ కూడా విద్యార్థిలా బెంచ్ మీద కూర్చుని పాఠాలు వినడం ఆసక్తికరంగా మారింది. తన స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ.. తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అప్పట్లో పేరెంట్స్ మీటింగ్‌లకు రాలేకపోయిన విషయాన్ని పంచుకున్నారు. అలాగే తన కుమారుని పేరెంట్స్ మీటింగ్‌కి కూడా తాను అప్పుడప్పుడు హాజరుకాలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “తండ్రి అంటే గౌరవం అంటే ఇదే”, “లోకేష్ వ్యక్తిత్వం నిజంగా గొప్పది” అంటూ టీడీపీ అభిమానులు, సామాన్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దలు తిన్న ప్లేట్ తీసుకోవడం తమ బాధ్యతగా భావించే సంస్కారం లోకేష్‌లో కనిపించడం, రాజకీయ నేతల్లో అరుదుగా కనిపించే వినయానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. తండ్రి-కొడుకు మధ్య ఉన్న మమకారం, గౌరవం, వినయాన్ని మరోసారి దేశానికి తెలియజేశాడు లోకేష్.