Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక
- Author : Pasha
Date : 26-02-2024 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
Mohan Babu : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఫైర్ అయ్యారు. తన పేరును ఎవరూ పొలిటికల్‌గా వాడుకోవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో నా పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించు కుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మోహన్ బాబు కోరారు.
We’re now on WhatsApp. Click to Join
చేతనైతే నలుగురికి సాయపడదాం!
‘‘మనం అనేక రకాల భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం’’ అని మోహన్ బాబు చెప్పారు. ‘‘చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టి పెట్టాలి గానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకు రావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉండమని కోరుకుంటూ.. ఉల్లఘించిన వారిపై న్యాయచర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను’’ అని తన లేఖలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
Also Read : Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం హైదరాబాద్‌లో 11 లక్షల మందికే.. ఎందుకు ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచుకు బంధుత్వం ఉంది. విష్ణు భార్య విరోనికా తండ్రి వైఎస్ సుధాకర్ రెడ్డి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు. విష్ణుకు జగన్ బావ వరుస అన్నమాట. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ భార్య భూమా అఖిల ప్రియది రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె అక్క, సోదరుడు రాజకీయాల్లో ఉన్నారు. భూమా నాగిరెడ్డి, శోభా రాణి దంపతుల రాజకీయ ప్రస్థానం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు.
Also Read :Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలు కంటిన్యూ.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలుగు దేశం పార్టీలోని కొందరు వ్యక్తులతోనూ మోహన్ బాబు కుటుంబ సభ్యులకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పెద్దలను అప్పుడప్పుడూ మోహన్ బాబు ఫ్యామిలీ కలుస్తూ ఉంటారు. ప్రతి పార్టీలోనూ మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులు ఉన్నారని చెప్పొచ్చు. ఆ ఒక్కటి మాత్రమే కాదు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ ప్రభావం చూపించగల వ్యక్తి మోహన్ బాబు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు మోహన్ బాబు దూరంగా ఉంటున్నారు. ఏ ఒక్క పార్టీకో ఆయన మద్దతు ఇవ్వడం లేదు. అందువల్ల, ఆయన పేరు వాడుకోవద్దని తాజాగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో మందిని భావిభారత పౌరులుగా మోహన్ బాబు తీర్చిదిద్దుతున్నారు.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024