AP BJP: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి: పురంధేశ్వరి
- By Balu J Published Date - 12:30 AM, Fri - 16 February 24
AP BJP: రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వం పై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిధుల వినియోగం పై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చింది. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవిన్యూ, పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోందని అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదు. సొంత ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమాని ప్రభుత్వం చెల్లించలేదు. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ఎస్.సి, ఎస్.టి, బి.సి.ల పై దాడులు పెరిగాయి. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎం.ఎల్.సి.అనంత బాబు ను ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే 370 ఆర్టికల్ రద్దు…రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ప్యాకేజి బాగుందని కూడా చెప్పారు.
Related News
Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద�