HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lakshmi Parvathi Slams Chandrababu

CBN : టీడీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లే చంద్ర‌బాబును త‌రిమివేయాల‌ని లక్ష్మీ పార్వతి పిలుపు

  • Author : Sudheer Date : 09-02-2024 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Laxmi
Laxmi

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు తమ దూకుడును పెంచారు. వరుస పెట్టి నేతలు బయటకు వస్తూ టిడిపి – జనసేన కూటమి ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన రానున్న తరుణంలో తమ నోటికి పనిచెప్పారు ఆ పార్టీ నేతలు , శ్రేణులు. ముఖ్యంగా చంద్రబాబు ను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి కాస్త గాలి టిడిపి వైపు వీస్తుండడం తో..ఆ గాలిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తాజాగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..టీడీపీ పార్టీ నుంచి ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే చంద్ర‌బాబును త‌రిమివేయాల‌ని లక్ష్మీ పార్వతి పిలుపునిచ్చారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి అని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇక చంద్రబాబు ఢిల్లీ లో బిజెపి నేతలను కలవడం ఫై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడ‌ని , జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఒంటరిగా ఎదుర్కోలేక పవన్, బీజేపీని చంద్ర‌బాబు తెచ్చుకోవాలని చూస్తున్నాడని నాని పేర్కొన్నారు. బీజేపీ, చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా..? సిగ్గు.. ఎగ్గులేకుండా జనం మధ్యకు వస్తారా..? సమాధానం చెప్పాల‌ని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు.

2014లో ఏపీ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నాడు. బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగాడు. నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీపై చంద్రబాబు బూతులు తిట్టాడు. ప్రధాని మోదీకి భార్యలేదన్నాడు. కుటుంబం కూడా లేనోడు నాతో పోటీనా అన్నాడు. ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నాడు. బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. మాకు సిగ్గు లేదు రాజకీయాలు కావాలి అని ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారా అని ఆయన అన్నారు.

Read Also : CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • lakshmi parvathi

Related News

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd