Kiran Royal : కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన మహిళ అరెస్ట్
Kiran Royal : లక్ష్మి తన ఫిర్యాదులో కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, తన దగ్గర నుండి నగదు, బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు
- By Sudheer Published Date - 03:31 PM, Mon - 10 February 25
జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal ) పై తీవ్ర ఆరోపణలు చేసిన లక్ష్మి (Lakshmi Arrest) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ తనను మోసం చేశాడని ఆమె సోమవారం ఉదయం తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయగా, కొద్ది గంటల్లోనే రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేశారు. జైపూర్‌లో ఆమెపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మి తన ఫిర్యాదులో కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, తన దగ్గర నుండి నగదు, బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.
RK Roja : రోజా సీటుకు ఎసరు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జగదీష్ ప్రకాశ్ ?
అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు కూడా తాను ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత డబ్బు తిరిగి ఇస్తానని నమ్మించి తనను మోసం చేశాడని తెలిపింది. తన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతానని , కిరణ్ రాయల్ గతంలో మరికొంతమంది మహిళలను కూడా మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఇక ఈ వివాదంపై జనసేన అధిష్టానం స్పందిస్తూ.. కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, లక్ష్మి చేసిన ఆరోపణలపై పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా..లక్ష్మిపై గతంలో చీటింగ్ కేసులు ఉన్నట్లు, పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయినట్లు వెలుగులోకి రావడం , రాజస్థాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.