Kurnool Mayor : ఓటర్ల జాబితా సవరణలో కర్నూలు మేయర్ ఓటు గల్లంతు
కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య ఓటు గల్లంతు అయింద. సవరించిన ఓటర్ల జాబితా నుంచి ఆయన ఓటు గల్లంతు
- By Prasad Published Date - 07:41 AM, Thu - 17 August 23

కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య ఓటు గల్లంతు అయింద. సవరించిన ఓటర్ల జాబితా నుంచి ఆయన ఓటు గల్లంతు కావడం అధాకారపార్టీలో చర్చనీయాంశంగా మారింది. రామయ్య 2021 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నారు. కర్నూలులోని పోలింగ్ స్టేషన్ 191లో ఆయన ఓటు వేశారు. ఆ తర్వాత కార్పొరేటర్‌గా ఎన్నికై మేయర్‌గా పదవి చేపట్టారు. అయితే 138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో సవరించిన ఓటర్ల జాబితా నుండి అతని పేరు అదృశ్యమైంది.దీనిపై బీవై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజనకు వినతిపత్రం సమర్పించారు. తన లేఖలో, పోలింగ్ స్టేషన్ నెం. 191, ఓటరు ID NKD3434503 నెంబర్‌ని జతపరిచారు. రామయ్య తన బూత్ లెవల్ అధికారితో ఓటరు స్థితిని సరిచూసుకోవడంతో ఈ విషయం బయటపడింది. సంబంధిత BLO సవరించిన ఓటర్ల జాబితాలో ఆయన ఓటరు ID గుర్తించబడలేదని తెలియజేశారు. జాబిత సవరణలో నిర్లక్ష్యం వహించిన వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన కోరారు.