Gudivada Politics : కొడాలి నాని కి చీర, గాజులు
Gudivada Politics : ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు వినూత్నంగా స్పందిస్తూ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు
- By Sudheer Published Date - 08:27 PM, Sat - 12 July 25

గుడివాడ లో మళ్లీ రాజకీయం వేడి గరంగరంగా మారింది. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ నియోజకవర్గం, తాజాగా టీడీపీ-వైసీపీ మధ్య నెలకొన్న విభేదాలతో మళ్లీ హీటెక్కింది. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు వినూత్నంగా స్పందిస్తూ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు. చంద్రబాబుకు బూట్లు పాలిష్ చేస్తున్నట్టు కొడాలి నానిని చూపిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. నాని గతంలో చేసిన ఛాలెంజ్‌ను గుర్తుచేస్తూ ఈ చర్యలు చేపట్టారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. దీంతో, గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Perni Nani Rappa Rappa Comments : దూల తీరింది..పేర్ని నానిపై కేసు
వివాదాస్పద ఫ్లెక్సీలతో రాజకీయం రచ్చకెక్కింది. టీడీపీ-జనసేన కార్యకర్తలు, వైసీపీ ఫ్లెక్సీలను చింపేసారు. పోలీసుల జోక్యం వల్లే ఉద్రిక్తత పెరగకుండా ఆపగలిగారు. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన జెడ్పీటీసీ హారిక వాహనంపై దాడి జరగడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. కారు అద్దం ధ్వంసం కాగా, ఆ వాహనంపై టీడీపీ జెండా అతికించారు. మరోవైపు పేర్ని నాని గుడివాడలోకి రాకుండా ఆందోళన చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు చీరలు, గాజులతో నిరసన తెలిపారు. దాంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక వైసీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. కొడాలికి చెందిన K కన్వెన్షన్‌కు టీడీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, వైసీపీ కేడర్ కూడా ఎదురుగా రావడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. గుడివాడ ప్రస్తుతం రాజకీయం తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.