Lakshmi : కిరణ్ రాయల్ చేతిలో పవన్ జాతకం..ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది..?
Lakshmi : కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గురించి తనతో చాలా రహస్యాలు పంచుకున్నాడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన వద్ద కీలకమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్
- By Sudheer Published Date - 06:34 PM, Sat - 15 February 25

నాల్గు రోజులుగా జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royale) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తనను మోసం చేసాడని చెప్పి లక్ష్మి (Lakshmi ) అనే మహిళా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే జైపూర్ పోలీసులు పలు కేసుల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడం, కోర్టు నుండి బెయిల్ రావడం జరిగింది. శనివారం తిరుపతికి వచ్చిన లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించింది.
CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు
ఆమె మాట్లాడుతూ..కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Videos) గురించి తనతో చాలా రహస్యాలు పంచుకున్నాడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన వద్ద కీలకమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్ (Pen Drive) ఉందని చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేయడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, తనను అక్రమంగా అరెస్ట్ చేయించేందుకు కిరణ్ ప్రయత్నించినట్లు ఆరోపించారు. జైపూర్ పోలీసులు తనను అరెస్ట్ చేసిన తీరు అన్యాయమని, న్యాయవ్యవస్థలో తనకు న్యాయం జరిగిందని వెల్లడించారు.
ఇదే సందర్భంలో మాజీ మంత్రి రోజా బంధువును కూడా కిరణ్ రాయల్ మోసం చేశారని లక్ష్మీ ఆరోపించారు. అవసరానికి వాడుకొని, తర్వాత వారిని వదిలేసే వ్యక్తిత్వం కిరణ్ రాయల్‌కు ఉందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కిరణ్ రాయల్ ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, లక్ష్మీ చేసిన ఆరోపణలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. పవన్ కళ్యాణ్ కు సంబదించిన విషయాలు ఏమున్నాయి..? అసలు ఆ పెన్ డ్రైవ్ ఏంటి..? అందులో ఏమున్నాయి..? మరి ఆ పెన్ డ్రైవ్ నిజంగా కిరణ్ వద్ద ఉందా..? లక్ష్మి చేసిన ఆరోపణలు నిజమేనా..? వీటికి సమాదానాలు తెలియాలంటే కిరణ్ స్పందించాల్సి ఉంది.