Gandikota Girl Murder Case : గండికోట బాలిక హత్య కేసులో కీలక మలుపు
Gandikota Girl Murder Case : సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లోకేష్ నిర్దిోషి అని స్పష్టత రావడంతో, ఈ హత్య వెనక ఉన్న వారిపై దృష్టి కేంద్రీకరించారు
- By Sudheer Published Date - 08:33 PM, Wed - 16 July 25

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక స్థలం గండికోట(Gandikota )లో జరిగిన ఇంటర్ బాలిక హత్య కేసు (Girl Murder Case) సంచలనం రేపింది. ఈ కేసులో బాలిక ప్రియుడైన లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. బాలిక కాలేజీకి వెళ్లకుండా ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లింది. కానీ తర్వాత రోజు ఉదయం ఆమె మృతదేహం గండికోట వద్ద కనిపించడం కేసును మరింత మలుపు తిప్పింది. మొదట్లో ఈ హత్యపై అనుమానాలుంటే ఇప్పుడు ఇది పరువు హత్యగా మారుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
ప్రియుడి చెప్పిన కథనం ప్రకారం.. బాలిక బంధువులు గండికోటకు వచ్చి ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తాను ఒక్కడే తిరిగి వచ్చానని లోకేష్ పోలీసులకు చెప్పాడు. అయితే మృతదేహం ఆధారంగా తీసిన వైద్య నివేదికలు మాత్రం బాలికను అర్థరాత్రి తర్వాత హత్య చేసినట్లు చూపిస్తున్నాయి. అంటే గండికోటకు వెళ్లిన తర్వాత వెంటనే హత్య జరగలేదని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తుది కోణంగా పరువు హత్య కోణాన్ని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు చేపట్టారు.
ZPTC – MPTC : జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
లోకేష్‌పై కేసు మోపడానికి ప్రయత్నించిన కుట్ర కూడా బయటపడింది. బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసి, ప్రియుడే హత్య చేశాడనే అనుమానాన్ని కలిగించేలా పథకం వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లోకేష్ నిర్దిోషి అని స్పష్టత రావడంతో, ఈ హత్య వెనక ఉన్న వారిపై దృష్టి కేంద్రీకరించారు.
బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని వైద్య నివేదికలు తెలిపాయి. దీంతో కేసు పరువు హత్య కోణంలోకి మళ్లింది. ఈ కేసులో పోలీసులు తుది దశ దర్యాప్తు జరుపుతూ, త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రియుడిని ఇరికించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఇది పూర్తిగా కుటుంబ పరువు పరిరక్షణ పేరిట జరిగిన దారుణమైన హత్యగా భావిస్తున్నారు.