HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kesineni Nani Is Busy In Politics Again

Kesineni Nani : మళ్లీ రాజకీయాల్లో కేశినేని నాని బిజీ..?

Kesineni Nani : 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది

  • Author : Sudheer Date : 16-02-2025 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kesineni Nani Is Busy In Po
Kesineni Nani Is Busy In Po

విజయవాడ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు కేశినేని నాని (Kesineni Nani). 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నందిగామ, మైలవరం వంటి ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ, రాజకీయంగా తిరిగి బలంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎవరితో కలుస్తారు? ఏ పార్టీలోకి వెళ్లతారు? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

30 Thousand Jobs: గుడ్ న్యూస్‌.. తెలంగాణ‌లో మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు!

కేశినేని నాని తన రాజకీయ ప్రయాణాన్ని టీడీపీతో ప్రారంభించి, విజయవాడ ఎంపీగా గెలిచారు. కానీ టీడీపీ అధిష్టానంతో విభేదాలు పెరిగి, పార్టీలో అసంతృప్తిగా మారారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ వ్యతిరేకంగా ధోరణి అవలంభించడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నదమ్ముల మధ్య రాజకీయపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. చివరికి 2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా గెలవగా, కేశినేని నాని ఓటమిపాలయ్యారు. 2024 ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, ఇప్పుడు తిరిగి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అనుచరులకు రాజకీయంగా యాక్టివ్‌గా ఉండాలని సూచిస్తూ, తన రీఎంట్రీపై పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు. అయితే, ఆయనకు టీడీపీలో మళ్లీ చోటు దొరకడం కష్టమే. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

కేశినేని నానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఆలోచనలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ కూడా కేశినేని చేరికపై హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన కుమార్తె కేశినేని శ్వేతకు మంచి రాజకీయ భవిష్యత్తు కల్పించేందుకు కూడా బీజేపీనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేశినేని నాని బీజేపీలో చేరితే.. విజయవాడ రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఉండగా, ఆయన అన్న నాని బీజేపీలో చేరితే, ఓటింగ్ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశముంది. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ, కేశినేని నాని చేరికపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kesineni Nani
  • kesineni nani joins bjp
  • Kesineni Nani re entry
  • political Re entry
  • vijayawada

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd