Mudragada : మరోసారి పవన్ ను విమర్శిస్తే..ప్రతిఘటిస్తా..ముద్రగడకు కూతురు వార్నింగ్..
తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు
- By Sudheer Published Date - 11:30 AM, Sat - 22 June 24

ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) కి..తన కూతురు క్రాంతి (Kranthi) వార్నింగ్ ఇచ్చింది. మరోసారి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే..తండ్రి అని కూడా చూడకుండా ప్రతిఘటిస్తా అంటూ హెచ్చరించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని గతంలో సవాల్ విసిరిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అధికారికంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అయినప్పటికీ తనలో మార్పు రావడం లేదు. పవన్ కళ్యాణ్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ..జోక్యం చేసుకుంటే పేర్లే కాదు ఊర్లు కూడా మార్చుకోవాల్సి వస్తుందని అభిమానులు హెచ్చరిస్తున్న..ఇంకా ముద్రగడ ..పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తూ కాపులకు రిజర్వేషన్ ఇప్పించాలని, సినిమాలు మానుకోవాలని పలు వ్యాఖ్యలు చేసారు ముద్రగడ. దీనిపై ముద్రగడ కుమార్తె క్రాంతి ఘాటుగా స్పందించారు. తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఇందులో పవన్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతే కాదు పవన్ కు మద్దతుగా తన పోరాటం కొనసాగుతుందని హింట్ ఇచ్చేసారు.
‘వైసీపీ అధినేత జగన్ గురించి ఏమి మాట్లాడరు. ఏ విషయంలో కూడా జగన్‌ను ప్రశ్నించరు. పవన్ కల్యాణ్‌పై మాత్రం విమర్శలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేయాలో పవన్ కల్యాణ్‌కు అవగాహన ఉంది. స్పష్టమైన విధానం ఉంది. జగన్‌కు అలాంటిదేమి లేదు. అందుకే ప్రజలు కూటమికి బ్రహ్మారథం కట్టారు. ప్రజలకు మంచి చేయాలన ఆలోచన జగన్‌కే కాదు ముద్రగడ పద్మనాభానికి కూడా లేదు. ఎన్నికల సమయంలో చేసిన సవాల్ మేరకు పేరు మార్చుకున్నారు. ఆలోచన విధానం ఏమాత్రం మారలేదు అని’ ముద్రగడ క్రాంతి ట్వీట్ చేశారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు.
Read Also : BiggBoss Telugu : బిగ్ బాస్ కి ఉన్న ఏకైక ఆప్షన్ అతనేనా..!