Viral : ఆఫీస్ బాయ్‌ని చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ
Viral : ‘మద్యం అక్రమంగా విక్రయించే వారితో కలిసి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావా?’ అంటూ ఆఫీస్ బాయ్ నాని మీద సీఐ అసహనం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టారు.
- By Sudheer Published Date - 10:41 AM, Sat - 17 May 25

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ శాఖ సీఐ (Excise Department CI) హసీనాభాను (Hasina Bhanu) తన ఆఫీస్ బాయ్‌పై చెప్పుతో దాడి (Attack with sandal) చేసిన ఘటన తీవ్ర వివాదంగా మారింది. ‘మద్యం అక్రమంగా విక్రయించే వారితో కలిసి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావా?’ అంటూ ఆఫీస్ బాయ్ నాని మీద సీఐ అసహనం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సీఐ హసీనాభాను పేరును ఉపయోగించి కొంతకాలంగా అక్రమ మద్యం వ్యాపారులు డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ విషయం ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు మేరకు సంఘం నాయకులు ఆమెతో మాట్లాడేందుకు స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో సీఐ, ఆఫీస్ బాయ్ నానిని పిలిపించి అందరి ముందు దురుసుగా ప్రవర్తించారు. మాటల తూటాలు సాగిన తరువాత సీఐ తన చెప్పుతో అతనిపై దాడికి దిగారు.
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీఐ స్థాయి అధికారి ఇలా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. సంఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, సీఐ ప్రవర్తనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధిత ఆఫీస్ బాయ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడు. ఈ ఘటనపై అధికారుల స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిపిన సంగతి తెలిసిందే.
అటెండర్ ను చెప్పుతో కొట్టిన సీఐ
వివాదాస్పదంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా భాను తీరు
అటెండర్ ను చెప్పుతో కొట్టిన కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను
తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పై ఆగ్రహం
తనకేం తెలియదని చెబుతున్న అటెండర్… pic.twitter.com/1XnGhoxsDH
— Telugu Feed (@Telugufeedsite) May 17, 2025