Jogi : అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్..ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనా..?
Jogi : జగన్ ప్రభుత్వం హయాంలో ఇసుక, లిక్కర్ వంటి ప్రధాన ఆదాయ వనరులను నియంత్రించడమే కాకుండా, ఇతర ప్రజాధనాల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పటికే విమర్శలు వచ్చాయి
- By Sudheer Published Date - 10:59 AM, Sat - 24 May 25

మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) గత ప్రభుత్వ హయాం(YCP Govt)లో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. జగన్ ప్రభుత్వం హయాంలో ఇసుక, లిక్కర్ వంటి ప్రధాన ఆదాయ వనరులను నియంత్రించడమే కాకుండా, ఇతర ప్రజాధనాల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. తాజాగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర బట్టబయలైంది. ఆయన ప్రభుత్వంలో ఉండగానే వివాదాస్పదంగా అగ్రిగోల్డ్ ఆస్తులను సొంతంగా మార్చుకుని, అమ్మినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డులు, సర్వే నంబర్లు ఇప్పుడు శాస్వత సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
Kavitha : కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు..? కవితకు 11 ప్రశ్నలు సంధించిన ప్రభుత్వ విప్
జోగి రమేష్ చేసిన ఈ అక్రమాలను అగ్రిగోల్డ్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకొచ్చింది. విజయవాడలోని ఓ కీలక స్థలాన్ని సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ స్థలంగా తప్పుడు పత్రాలు రూపొందించి, విక్రయించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జోగి కుమారుడి పేరును ఉపయోగించి లావాదేవీలు జరిపారని సమాచారం. ఇప్పటికే ఆయన కుమారుడు అరెస్ట్ కావడంతో పాటు, బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ పరిణామాలు జోగి రమేష్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి.
జోగి రమేష్ అనేక అక్రమాలు చేయడం తో పాటు, అధికారంలో ఉన్నంత కాలం వాటిని కప్పిపుచ్చుకోవచ్చని భావించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక జోగి రమేష్‌కు కూడా అతి త్వరలో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.