AP : జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేస్తూ వినూత్న నిరసన
- Author : Sudheer
Date : 03-01-2024 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
గత ఎన్నికల్లో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar ) రిలీజ్ చేస్తానని చెప్పి జగన్ (Jagan) మాట తప్పడంటూ..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు (Ravi Naidu) ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నిరుద్యోగంలను యువతను మోసగించేలా ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అదే రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల పోస్టులను, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6000 పోస్టులను, ఇతర శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును జాబ్ క్యాలెండర్ లో పెట్టి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట తప్పడని..2020, 21 ,22, 23 ,24 సంవత్సరాల్లో జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోను సజీవ సమాధి చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మన జీవితాలు మారిపోతాయి మన తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు అని ఆశపడిన యువత తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగా భావించాలని ఆయన అన్నారు. చివరి సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారేమో అని వేచి చూసిన యువత కళ్ళల్లో కారం కొట్టారని జగన్ మోహన్ రెడ్డికి పతనం స్టార్ట్ అయిందని రవి అన్నారు.
Read Also : Viral Video : పెట్రోలుకు కటకట.. గుర్రంపై జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ