Pawan Kalyan : పవన్ జోలికొస్తే పీర్ల పండగే..ఖబడ్దార్..జానీ మాస్టర్ మాస్ వార్నింగ్
- Author : Sudheer
Date : 10-02-2024 - 7:53 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ జోలికొస్తే ఇక పీర్ల పండగే..అని పవన్ (Pawan Kalyan) ఫై విమర్శలు చేసే వారికీ వార్నింగ్ ఇచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ , జనసేన నేత జానీ మాస్టర్ (Jani Master). నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ మాస్టర్ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ..అతి తక్కువ టైంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేవలం తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ అగ్ర హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నాడు. అలాంటి జానీ మాస్టర్..రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరి..రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానించే జానీ..ఇప్పుడు పవన్ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుండడం తో అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వారికీ జానీ మాస్టర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ జోలికొస్తే పీర్ల పండగేనంటూ హెచ్చరించారు.
We’re now on WhatsApp. Click to Join.
నెల్లూరులో జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కేవీ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లవరకూ ర్యాలీ చేశారు. అనంతరం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పూర్తైన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుందన్న జానీ మాస్టర్.. కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారని విమర్శించారు. మిగతావారికి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని మండిపడ్డారు.
టిడ్కో ఇళ్లను సంక్రాంతికి ఇస్తానని చెప్పిన అనిల్ కుమార్ కనిపించకుండా పోయారంటూ సెటైర్లు వేశారు. సిద్ధం సభలకు పేద ప్రజల డబ్బులతో ఫ్లెక్సీలు వేయించుకున్నారన్న జానీ మాస్టర్.. ఆ డబ్బులు పేదలకు ఇచ్చినా వారి రాతలు మారేవని అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు పదేపదే పవన్ కళ్యాణ్ జోలికొస్తున్నారన్న జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ వెనుక జానీ మాస్టర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. పవన్ జోలికొస్తే పీర్ల పండగేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also : YS Sharmila : జగన్ పులి కాదు.. బీజేపీ ముంగిట పిల్లి – షర్మిల