Janasena : వేలానికి పవనిజం!మచిలీపట్నం సభపై దుమారం!
జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ గా పెద్ద ముద్ర ఉంది.
- By CS Rao Published Date - 01:55 PM, Thu - 9 March 23

జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ గా(Pawan) పెద్ద ముద్ర ఉంది. ప్రత్యర్థి పార్టీలు బలంగా తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిలకడలేని, నాన్ సీరియస్ పొలిటిషియన్ గా ఆయన్ను చిత్రీకరించారు. ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీని హైదరాబాద్ లో వేలానికి పెట్టారని అంబటి రాంబాబు చెబుతున్నారు. అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ఆ పార్టీని వేలంలో పాడుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, పవన్ చేసే పనులు కాపు కులానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని సామాజిక కోణాన్ని అంబటి బయటకు లాగారు. ఇదంతా మచిలీపట్నం కేంద్రంగా జరిగే జనసేన ఆవిర్భావ సభను ఫెయిల్ చేయడానికి వేస్తోన్న ఎత్తుగడగా పవన్ అభిమానులు కొట్టిపడేస్తున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ ముద్ర (Janasena)
ఇటీవల వరకు చంద్రబాబుకు అమ్ముడుపోయాడని పవన్ (Pawan)మీద వైసీపీ దుమ్మెత్తిపోసింది. ఆయన్ను దత్తపుత్రుడిగా, దుష్టచతుష్టయంలో కలిసిన వాడిగా చిత్రీకరించింది. గుంటూరులో జరిగిన ప్లీనరీ వేదికగా పవన్ ను ఆడిపోసుకుంది. చంద్రబాబు, పవన్ కలిసిన ప్రతిసారీ ముసుగు తొలుగుతుందని ప్రచారం చేశారు. సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ చేశారు. టీడీపీ, జనసేన(Janasena) కలిసి వచ్చినా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ పవన్ కు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు 1000 కోట్లకు అమ్ముడు పోయాడని ఆరోపిస్తున్నారు. వాళ్ల ఆరోపణలకు తగిన విధంగా పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలను నాన్ సీరియస్ గా నడుపుతున్నారని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read : Janasena : `వారాహి` కదిలేది అప్పుడే.! ఆర్భావ సభలో జై చంద్రన్న రోడ్ మ్యాప్ ?
వాస్తవంగా జనవరి 26వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కావాలి. అందుకోసం తెలంగాణలోని కొండగట్టు, ఏపీలోని విజయవాడ దుర్గమ్మ వద్ద పూజలు చేశారు. ఆ తరువాత దాన్ని తీసుకెళ్లి షెడ్ లో పెట్టారు. దాన్ని బయటకు తీయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. షెడ్ లో తప్పు బట్టిపోకుండా చూసుకోవాలని వ్యంగ్యాస్త్రాలను అంబటి రాంబాబు ఇటీవల పలు సందర్భాల్లో సంధించారు. వారాహి యాత్ర ప్రారంభం కావాల్సిన ఒక రోజు తరువాత అంటే, జనవరి 27న యువగళం ప్రారంభం అయింది. నానాటికీ లోకేష్ గ్రాఫ్ పెరుగుతోంది. యువగళం, వారాహిని ఎవరూ ఆపలేరని లోకేష్ ప్రసంగాల్లో వినిపించారు. అంటే, టీడీపీ, జనసేన(Janasena) అవగాహనతో రాజకీయాలను నడుపుతున్నారని వైసీపీ చెబుతున్నదానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన అవగాహనతో రాజకీయాలను
తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగు పెడుతోన్న జనసేన(Janasena) మార్చి 14వ తేదీన ఆవిర్భావసభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 4లక్షల మందితో సమావేశాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ రోజు పవన్ (Pawan) ఇచ్చే దిశానిర్దేశం ఆ పార్టీ భవిష్యత్ ను సూచించనుంది. ఇప్పటి వరకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూసిన జనసేనాని ఆ రోజు బయట పెడతారని తెలుస్తోంది. బీజేపీతో కటీఫ్ కావడంతో పాటు తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. అలాంటి సంకేతాలు ఆ సభ నుంచి వస్తాయని ఉత్కంఠగా జనసైనికులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఏపీ రాజకీయాలను కూడా ఆ సభ కొంత వరకు మార్చేయనుంది.
మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేస్తానంటున్నారు పవన్(Pawan). కనీసం 25 చోట్ల పోటీ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఇటీవల జనసేనాని(Janasena) ప్రకటించారు. ఇక, ఏపీలో ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారు? అనేది తెలియదు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన సంకేతం ప్రకారం 25 చోట్ల తెలంగాణాలో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారని వైసీపీ అనుమానిస్తోంది. అందుకే, హైదరాబాద్ కేంద్రంగా జనసేన పార్టీని వేలానికి పెట్టారని అంబటి ఆరోపిస్తున్నారు. వాస్తవంగా బీజేపీతో పొత్తు ఉన్నామని జనసేన చెబుతోంది. ఏపీ బీజేపీ కూడా ఎప్పటికప్పుడు పొత్తు ఉందని నమ్మిస్తోంది. కానీ, తెలంగాణ బీజేపీ మాత్రం జనసేన పార్టీని దగ్గరకు కూడా రానివ్వడంలేదు. దానిపై పవన్ ను ప్రశ్నిస్తే, కేంద్ర బీజేపీతో మాత్రమే పొత్తు ఉందని చెబుతారు. ఇలాంటి గందరగోళానికి మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభ ద్వారా పవన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అందుకే, ఆ సభకు అంతగా హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : TDP-Janasena : జనసేనలోకి రాధా ? `క్విడ్ ప్రో కో`చదరంగంలో వంగవీటి, కన్నా.!

Related News

Janasena : `వారాహి`పనైయిపోయింది! ఇక సీఎం అయితేనే..!
పదో ఆవిర్భావం సందర్భంగా మచిలీపట్నం వేదికపై పవన్ (janasena )