Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
- Author : Sudheer
Date : 24-01-2024 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) కి తీపి కబురు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తు (Janasena Gets Glass Tumbler Symbol)ను గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ (Pawan Kalyan) పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీ రిక్వెస్ట్ తో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ..టిడిపి తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై చర్చించారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. కానీ కాపు నేతలు మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని జనసేనానిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక జనసేన పార్టీ లోకి కూడా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు , సీనియర్ రాజకీయ ప్రముఖులు చేస్తున్నారు. ఇదే సందర్భాంగా పలువురు సినీ ప్రముఖులు సైతం జనసేనలో చేరుతూ పార్టీ కి బలాన్ని ఇస్తున్నారు. బుధువారం సినీ పరిశ్రమ నుండి జానీ మాస్టర్ , 30 ఇయర్స్ పృద్వి లు జాయిన్ అయ్యారు. వీరికి పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీ లోకి ఆహ్వానించారు.
Read Also : Chiranjeevi : ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..