Jagan Himalayas : హిమాలయాలకు మాజీ సీఎం జగన్..?
ఘోర ఓటమి బాధ నుండి బయట పడేందుకు కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లాలని భావించాడట
- By Sudheer Published Date - 12:31 PM, Sat - 29 June 24

అసెంబ్లీ ఎన్నికల (2024 Result) ఓటమి దెబ్బ తో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) హిమాలయాలకు (Himalayas ) వెళ్లేందుకు సిద్దమయ్యాడట. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించి సీఎం గా బాధ్యతలు చేపట్టిన జగన్..మరోసారి రాష్ట్ర ప్రజలు పట్టం కడతారని ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు. 175 కు 175 సాధిస్తామని , సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అనుకున్నాడు కానీ ప్రజలు మాత్రం 11 సీట్లకే పరిమితం చేయడం తో షాక్ లో పడ్డారు. ఈ ఘోర ఓటమి బాధ నుండి బయట పడేందుకు కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లాలని భావించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల ఫలితాల తరువాత గత వారం పార్టీ నేతలతో జగన్ సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగుచూశాయి. తాను అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందని అన్నారట. కానీ మరి ఎందుకు వెళ్లలేదో తెలుసా?. దానికి కూడా జగన్ సమాధానం చెప్పారట. నిజంగానే హిమాలయాలకు వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో ప్రజలు మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాలి అనిపించింది. దాంతోనే మెల్లగా ఎన్నికల ఫలితాల నుంచి బయటికొచ్చాను.
ఆ రిజల్ట్స్ ఎందుకు అలా వచ్చాయి అనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాము, వాటిలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. అందువల్లనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చినట్లే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం అవ్వండి’ అని నేతలతో మాజీ సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలపై అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : NTR : ఎన్.టి.ఆర్ తో జోడీ.. ఆ ఇద్దరిలో ఎవరు..?